Love Tragedy: వరుసకు మేనత్త (Aunt). అల్లుడిపై(Nephews) ప్రేమ (Love) పెంచుకుంది. ఇద్దరు ఏకమయ్యారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి అనుమతి కోరారు. కానీ వారికి కుటుంబసభ్యులు నో చెప్పడంతో ఇక బతకడం వృథా అని అనుకున్నారు. కలిసి జీవించడం వీలు కాకపోవడంతో బతికినా ప్రయోజనం లేదని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడంతో తమ ప్రేమ ప్రయాణం సాగదని తెలుసుకున్నారు.
మధ్యప్రదేశ్ లోని సిహావల్ మండలంలోని ఓ యువకుడు తనకన్నా పెద్దదైన మేనత్తను ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. ఏడాది కాలంగా వీరి ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అత్త గర్భం దాల్చింది. విషయం ఇంట్లో తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ఇద్దరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇంట్లో వారు వారి ప్రేమను సమ్మతించలేదు. కుటుంబసభ్యలు ససేమిరా అనడంతో వారికి భవిష్యత్తు అంధకారంగా కనిపించింది.
దీంతో వీరి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులు గుర్తించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో వారి నుంచి స్పందన లేకపోవడంతోనే వారు బతుకులు చాలించినట్లు తెలుస్తోంది. వారికి పెళ్లి చేస్తే వారు ఆత్మహత్య చేసుకునే వారు కాదని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల నిర్వాకంతోనే అత్త, అల్లుడు మరణించినట్లు చెబుతున్నారు..
ఇంట్లో వారు అల్లుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సరైంది కాదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతడు వినలేదు. వారి సూచనలను పట్టించుకోలేదు. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. సోన్ నది వంతెనపై నుంచి దూకి ప్రాణాలొదిలారు. ఇసుక తిన్నెలపై పడిన వారి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు.