
Woman : సామాజిక మాధ్యమాలతో చిక్కులు వస్తున్నాయి. తన అభ్యంతరకర వీడియోను(Obscene Video) భర్త (Husband) సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మనస్తాపం చెందిన భార్య (Wife) తనువు చాలించింది. భర్త చేసిన నిర్వాకంతో విసుగు చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ట్రిబుల్ తలాక్ నేరమని తెలిసినా అతడు తన భార్యకు అదే పద్దతిలో తలాక్ చెప్పి వదిలించుకున్నాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త చేసిన పనికి బాధపడింది. అయినా తన పుట్టింటిలోనే సంతోషంగా ఉంటోంది. ఈ క్రమంలో తన భర్త కుమారుడిని తీసుకెళ్లిపోవడంతో మనస్తాపం చెందింది.
ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని ముజఫర్ నగర్ జిల్లా భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ అధికారి దీపక్ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం వీరికి నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే మూడు నెలల కిందట నిందితుడు ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యకు విడాకులిచ్చాడు. దీంతో భార్య కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఆగస్టు 18న కుమారుడిని భర్త బలవంతంగా తీసుకెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిని తీసుకుపోవడంతో ఆమె తట్టుకోలేకపోయింది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలికి చెందిన ఓ అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో కలత చెందిన ఆమె ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై వేధింపులు, గృహహింస తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముస్లిం మహిళ (వివాహ హక్కుల సంరక్షణ) చట్టం 2019 నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరమని చెప్పారు. మూడేళ్ల జైలు శిక్ష ఖాయమని చెబుతున్నారు.