
మనలో చాలామంది దగ్గర చినిగిపోయిన కరెన్సీ నోట్లు ఉంటాయి. ఆ కరెన్సీ నోట్లు మార్కెట్ లో చెల్లుబాటు కాకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కరెన్సీ నోట్లు సులభంగా నలిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో వేర్వేరు కారణాల వల్ల కరెన్సీ నోట్లు చినిగిపోతూ ఉంటాయి. 10, 20, 50 రూపాయల నోట్లతో పోలిస్తే 100, 500, 2000 రూపాయల నోట్లు చినిగిపోతే వాటిని మార్చుకోవడం కష్టమవుతుంది.
Also Read: పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్.. ఈ తప్పు చేస్తే పెన్షన్ కట్..!
చినిగిన నోట్లు మన దగ్గర ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ఎలాంటి లాభం ఉండదు. అయితే వాటిని సులువుగా మార్చుకుని కొత్త నోట్లను ఉచితంగా పొందే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకులు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులు సైతం ప్రజలకు చినిగిపోయిన నోట్లకు బదులుగా కొత్త నోట్లను ఇస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా చేస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చినిగిపోయిన నోట్ల స్థానంలో బాగున్న నోట్లను ఇవ్వాలని బ్యాంకులను గతంలోనే ఆదేశించింది. అయితే చాలా బ్యాంకులు నిర్ణీత సమయంలో మాత్రమే ప్రజలు చినిగిపోయిన నోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే దేశంలో కొన్ని బ్యాంకులు మాత్రం చినిగిపోయిన నోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.
Also Read: నిరుద్యోగులకు హెచ్‌సీఎల్ శుభవార్త.. 9,000 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..?
మీ దగ్గర ఎక్కువ మొత్తంలో చినిగిపోయిన కరెన్సీ నోట్లు ఉంటే ఆర్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి కూడా సులువుగా కరెన్సీని మార్చుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్బాల్లో మాత్రం బ్యాంకులు కరెన్సీ నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తాయి. అలాంటి సమయంలో మాత్రం ఆర్బీఐను సంప్రదించి కరెన్సీ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది.