https://oktelugu.com/

పార్లమెంట్ లో గళం.. ఏపీకి వైసీపీ ఎంపీలు ఏం సాధించారో తెలుసా?

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎంపీలు మరోసారి గళం విప్పారు. తమ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో మొండిచేయి చూపారని పార్లమెంట్ ను కుదిపేశారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ గుంటూరు, విజయనగరం, కాకినాడ, పెనుగొండ, విశాఖ, నెల్లూరు, అచ్యుతాపురంలో ఈఎస్ఐ నూతన ఆస్పత్రులకు సూత్రప్రాయమైన అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. మార్చి 2023 నాటికి రూ.73.68 కోట్లతో విజయనగరంలో 100 పడకల […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2021 9:48 am
    Follow us on

    పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎంపీలు మరోసారి గళం విప్పారు. తమ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులో మొండిచేయి చూపారని పార్లమెంట్ ను కుదిపేశారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ గుంటూరు, విజయనగరం, కాకినాడ, పెనుగొండ, విశాఖ, నెల్లూరు, అచ్యుతాపురంలో ఈఎస్ఐ నూతన ఆస్పత్రులకు సూత్రప్రాయమైన అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. మార్చి 2023 నాటికి రూ.73.68 కోట్లతో విజయనగరంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వివరించారు. గృహ రుణాలపై వడ్డీపై రాయితీ చెల్లింపు పథకాన్ని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీ హర్దీవ్ సింగ్ తెలిపారు.

    Also Read: ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం?

    ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద అర్హులైన మధ్యతరగతి ప్రజల గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులు ఇచ్చారు. కర్నూలు విజయవాడ.. విజయవాడ కర్నూలు విమాన సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదని.. ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ప్రకాశం బ్యారేజీ .. హైదరాబాద్, విజయవాడ.. నాగర్జునసాగర్ మధ్య సీ ప్లేన్ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. గత 19 మాసాల్లో ఏపీలోని హిందూ దేవాలయాలపై 140కి పైగా దడులు, దేవతా విగ్రహాలను కూల్చివేసి.. అపవిత్రం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని.. ఎంపీలు ప్రస్తావించారు. ఏపీ సహా దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మౌలిక సదుపాయాల రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వైసీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కేంద్రాన్ని కోరారు.

    Also Read: బీజేపీకి ‘పల్నాడు ఆశాదీపం’ అంబటి నవకుమార్

    చెన్నై.. బెంగుళూరు.. మైసూరు హైస్పీడ్ రైలుపై వైఎస్సార్ సీపీ ఎంపీ రెడ్డప్ప ప్రశ్నించారు. అనంతపురం నుంచి ఢిల్లీలోని ఆదర్శనగర్ వరకు కిసాన్ రైలు సేవలు అందివ్వాలని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చారు. వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, రెడ్డప్ప, సత్యవతి, ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సంబంధిత కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. పూణేలోని సీ డాక్ లో జాతీయ కృత్రిమ మేథస్సు కంప్యూటర్ పరంసిద్ధి ఏర్పాటుకు రూ.72.25 కోట్లు ఖర్చు చేసినట్లు వైసీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. మొత్తంగా ఏపీలోని సమస్యలపై వైసీపీ ఎంపీలు గళమెత్తిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానిక ప్రజలు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్