https://oktelugu.com/

బీజేపీకి ‘పల్నాడు ఆశాదీపం’ అంబటి నవకుమార్

పౌరుషాల గడ్డ పల్నాడు.. గుంటూరు జిల్లాలో ఉత్తర ప్రాంతాన ఉన్న ఈ ప్రాంతం దిగ్గజ నేతలకు పురిటిగడ్డ. పల్నాడు ప్రాంతానికి నరసరావుపేట ముఖద్వారం అని చెప్పొచ్చు. పల్నాడు ప్రాంతంలో దాచేపల్లి, గురజాల, మాచర్ల, కారంపూడి ముఖ్య పట్టణాలుగా ఉన్నాయి. ఆంధ్రా కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. ఆంధ్ర పల్లవులు నివసించిన ఈ ప్రదేశంలో ఇప్పటికీ రాజకీయ చైతన్యం ఎక్కువ. ఎంతోమంది పౌరుషం గల నేతలు ఇక్కడి నుంచి పుట్టుకొచ్చి రాష్ట్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : February 4, 2021 / 09:47 PM IST
    Follow us on

    పౌరుషాల గడ్డ పల్నాడు.. గుంటూరు జిల్లాలో ఉత్తర ప్రాంతాన ఉన్న ఈ ప్రాంతం దిగ్గజ నేతలకు పురిటిగడ్డ. పల్నాడు ప్రాంతానికి నరసరావుపేట ముఖద్వారం అని చెప్పొచ్చు. పల్నాడు ప్రాంతంలో దాచేపల్లి, గురజాల, మాచర్ల, కారంపూడి ముఖ్య పట్టణాలుగా ఉన్నాయి. ఆంధ్రా కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. ఆంధ్ర పల్లవులు నివసించిన ఈ ప్రదేశంలో ఇప్పటికీ రాజకీయ చైతన్యం ఎక్కువ. ఎంతోమంది పౌరుషం గల నేతలు ఇక్కడి నుంచి పుట్టుకొచ్చి రాష్ట్ర రాజకీయాలను ఏలారు.

    Also Read: ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం?

    ఒకప్పుడు హత్యలు, దాడులు, దౌర్జన్యాలు కొనసాగించిన ఈ ప్రాంతంలో ఇప్పుడు కొత్త సంస్కృతి పురుడు పోసుకుంటోంది. ముఖ్యంగా ఇక్కడ బలమైన పునాదులు వేసిన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఆయువుపట్టుపై దెబ్బకొట్టే ప్రయత్నాలను బీజేపీ మొదలు పెట్టింది. గతానికి భిన్నంగా ఇప్పుడు ఇక్కడి నేతలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా ఎంతో యాక్టివ్ గా ఉండే ఇక్కడి నేతలు  కమలం పార్టీవైపు ఆకర్షితులవుతున్నారు. గుంటూరు జిల్లా పల్నాడులో కీలక నాయకుడిగా ఉన్న అంబటి నవకుమార్ బీజేపీలో చేరి ఇక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. బీజేపీ తరుఫున కొత్త నాయకుడిగా అవతరించాడు.

    రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మార్పు చెందుతున్నాయి.. ఉన్న పార్టీలను వీడి కొత్త పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు.. బీజేపీ, జనసేన పార్టీలు బలోపేతం వైపు అడుగులేస్తున్నాయి.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండల మాజీ ఎంపిపి అంబటి నవకుమార్ తో పాటు ఆయన అనుచరులు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోచేరిన నవకుమార్ కు బీజేపీ గురజాల నియోజకవర్గ కన్వినర్ గా బాధ్యతలు అప్పగించారు. విజయవాడ లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేత పాతూరి నాగభూషణం, లంకా దినకర్ , తదితరులు పాల్గొన్నారు.

    Also Read: విజయసాయిరెడ్డి చేసిన పనికి వెంకయ్యనాయుడు ఏం చేశాడంటే?

    * నవకుమార్ కు ఆహ్వానం.. పల్నాడు పై ప్రత్యేక దృష్టి : సోము వీర్రాజు

    గుంటూరు జిల్లా మాజీ ఎంపిపి అంబటి నవకుమార్ ను పార్టీలోకి ఆహ్వానించి గురజాల నియోజకవర్గ కన్వీనర్ గా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించారు.. ఈ సందర్బంగా వీర్రాజు మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీలో చేరేందుకు పలుపార్టీల ప్రముఖనేతలంతా క్యూకడుతున్నారని అన్నారు.. ఆంద్రప్రదేశ్ లో కుటుంబపాలనలు సాగేంచే పార్టీలు బిసి వర్గస్తుడిని ముఖ్యమంత్రి చేసే సత్తా ఉందా అని సవాల్ విసిరారు. బిజెపి బహుజనులపార్టీ అని కితాబిచ్చారు.. బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు.. ప్రధాన మంత్రి మోది పాలనలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అభివృద్దికి బాటలు వేస్తున్నట్లు వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్దిని విమర్శించిందన్న వీర్రాజు వైసిపి పాలన పైన విమర్శలు గుప్పించారు.. బీసీలను ఓటు బ్యాంకు గా చూసే టిడిపి, బిజెపిలు రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిగా చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు.. పల్నాడు ప్రాంతంలో మైనింగ్ ను దోచుకోవడం లో ఉన్న శ్రద్ద అక్కడ అభివృద్ది పై చూపలేదన్నారు.. టీడీపీ హయాంలో హోం మంత్రి ను డమ్మీ చేసి నాటి గురజాల ఎమ్మెల్యే హోంమంత్రిగా పెత్తనం చెలాయించారని సోము విమర్శించారు. పల్నాడు లో ప్రధాన రహదారులతో పాటు అన్ని విధాల అభివృద్దికి బీజేపీ పాటు పడుతుందని స్పష్టం చేసారు. రానున్న రోజుల్లో జనసేన , బీజేపీ కలసి రాష్ట్రంలో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.

    * పల్నాడు లో పార్టీ ని బలోపేతం చేస్తా: నవకుమార్

    పార్టీలో చేరిన మాజీ ఎంపిపి నవకుమార్ మాట్లాడుతూ పల్నాడు లో పార్టీ ని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. నవకుమార్ బిజెపి లో చేరుతున్న సందర్భంగా దాచేపల్లి నుండి 40 కార్లతో ప్రదర్శన గా విజయవాడ కు వెళ్లారు.. ఎర్రబెల్లి మల్లిఖార్జున తో పాటు పలువురు, ఎస్సీ మహిళలు, వివిధ సామాజిక వర్గానికి చెందిన వారు బీజేపీలో చేరారు..

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్