https://oktelugu.com/

జ‌నానికి దూరంగా జ‌గ‌న్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌నానికి దూరంగా ఉంటున్నారా? పార్టీ నేత‌ల‌కు కూడా స‌మ‌యం కేటాయించ‌ట్లేదా? చివరకు ఎమ్మెల్యేలకు కూడా టైం ఇవ్వట్లేదా? అంటే.. అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఎందుకిలా జ‌రుగుతోంది? దీనికి కారణాలేంటీ? అన్న చ‌ర్చ బ‌య‌లుదేరింది. Also Read: దేశంలో వాట్సాప్ బ్యాన్ అవుతుందా? కేంద్రం కఠిన నిబంధనలు వాస్త‌వానికి జ‌గ‌న్ విప‌క్ష నేత‌గా ఉన్నప్పడు నిత్యం జనంలోనే ఉన్నారు. 2014లో ఓటమి తర్వాత ప్ర‌జ‌ల‌తో మ‌రింత‌గా మ‌మేయం అయ్యారు జగన్. రాష్ట్రానికి […]

Written By:
  • Rocky
  • , Updated On : February 26, 2021 / 10:19 AM IST
    Follow us on


    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌నానికి దూరంగా ఉంటున్నారా? పార్టీ నేత‌ల‌కు కూడా స‌మ‌యం కేటాయించ‌ట్లేదా? చివరకు ఎమ్మెల్యేలకు కూడా టైం ఇవ్వట్లేదా? అంటే.. అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఎందుకిలా జ‌రుగుతోంది? దీనికి కారణాలేంటీ? అన్న చ‌ర్చ బ‌య‌లుదేరింది.

    Also Read: దేశంలో వాట్సాప్ బ్యాన్ అవుతుందా? కేంద్రం కఠిన నిబంధనలు

    వాస్త‌వానికి జ‌గ‌న్ విప‌క్ష నేత‌గా ఉన్నప్పడు నిత్యం జనంలోనే ఉన్నారు. 2014లో ఓటమి తర్వాత ప్ర‌జ‌ల‌తో మ‌రింత‌గా మ‌మేయం అయ్యారు జగన్. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించాలంటూ పోరాటాలు చేశారు. దీక్ష‌లు చేప‌ట్టారు. యువ‌భేరీ స‌భ‌లు వంటివి చాలా చేశారు. ఇక‌, దాదాపు ఏడాదిన్న‌ర కాలంపాటు సుదీర్ఘంగా పాద‌యాత్ర చేసి, ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల‌నూ చుట్టేశారు.

    అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు కావస్తుంది. ఈ స‌మ‌యం చిన్న‌దేమీ కాదు. అయితే.. ఇంత కాలం గ‌డిచిపోయిన‌ప్ప‌టికీ.. ఒక్క‌సారి కూడా పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయ‌లేదు. చివ‌ర‌కు ఎమ్మెల్యేలను కూడా ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌లేదు. నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు తలెత్తుతున్నా.. ప‌ట్టించుకోవ‌ట్ల‌ద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అసంతృప్త నేత‌ల‌ను పిలిచి కార‌ణాలు కూడా తెలుసుకోవ‌ట్లేదు. దీనికి కార‌ణ‌మేంటో అర్థంకాక త‌ల‌ప‌ట్టుకుంటోంది వైసీపీ కేడ‌ర్‌.

    Also Read: నాడు ఎన్టీఆర్.. నేడు విష్ణువర్ధన్ రెడ్డి..

    గ‌డిచిన ఇరవై నెలల కాలంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకే జ‌గ‌న్ పరిమితమయ్యారని అంటున్నారు. ప్రజలతోపాటు పార్టీ క్యాడర్ ను కూడా కలిసే ప్రయత్నం చేయ‌ట్లేద‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంగానే.. స్థానికసంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టినా.. సాధ్యం కాలేద‌ని చెప్పుకుంటున్నారు. జగన్ సొంత జిల్లాలో సైతం విప‌క్షాలు కొన్ని స్థానాలు కైవసం చేసుకున్నాయి. మ‌రి, ఇప్పటికైనా జగన్ జనం బాట పడతారా? లేదా? చూడాల్సి ఉంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్