https://oktelugu.com/

వైదొలిగిన నాగార్జున.. అన్ని కోట్ల డీల్ వద్దన్నాడట..

టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున ఓ భారీ డీల్ ను తిరస్కరించడం చర్చనీయాంశమైంది. టాలీవుడ్ లో నాగార్జున తాజాగా తీస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ మూవీని ప్యాన్ ఇండియా లెవల్లో తీస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. డిపార్ట్ మెంట్ లో అంతా అతడిని ముద్దుగా వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా ఇందులో హీరోయిన్. అహితోష్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఎన్ఐఏ ఆఫీసర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2021 / 04:50 PM IST
    Follow us on

    టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున ఓ భారీ డీల్ ను తిరస్కరించడం చర్చనీయాంశమైంది. టాలీవుడ్ లో నాగార్జున తాజాగా తీస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ మూవీని ప్యాన్ ఇండియా లెవల్లో తీస్తున్నారు.

    ఈ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. డిపార్ట్ మెంట్ లో అంతా అతడిని ముద్దుగా వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా ఇందులో హీరోయిన్. అహితోష్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

    తాజాగా ఎన్ఐఏ ఆఫీసర్ గా చేస్తున్న ఈ రియల్ స్టోరీకి భారీ ఆఫర్ ఇచ్చిందట నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ తో నెట్ ఫ్లిక్స్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రేపో మాపో రిలీజ్ డేట్ ప్రకటిద్దామనుకుంటున్న టైంలో నెట్ ఫ్లిక్స్ కు హీరో నాగార్జున షాకిచ్చాడట..

    తాజాగా మొత్తం పూర్తయిన వైల్డ్ డాగ్ ఫస్ట్ కాపీ చూసి నాగార్జున షాక్ అయ్యాడట.. సినిమా ఔట్ పుట్ బాగా వచ్చిందంట.. దీంతో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యి అన్ని కోట్ల నెట్ ఫ్లిక్స్ అగ్రిమెంట్ ను రద్దు చేశాడట నాగార్జున..

    ఈ సినిమాకు బాగా ప్రమోషన్ చేసి అన్ని భాషల్లో రిలజ్ చేస్తే లాభాలు వస్తాయని.. థియేట్రికల్ రైట్స్ తోనూ కాసుల వర్షం కురుస్తుందని వెనక్కితగ్గాడట.. మరి అస్సలు బజ్ లేని ఈ మూవీ హిట్ అవుతుందా? నాగార్జున నమ్మకం నిలబడుతుందా? అనేది వేచిచూడాలి.