https://oktelugu.com/

నిర్మాతగా మారబోతున్న స్టార్ బ్యూటీ !

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కొత్త అవతారం ఎత్తబోతుంది. అవతారం అంటే.. అదే ఎదో కొత్త గెటప్ కాదు, ఆలియా కూడా సినిమా నిర్మాతగా మారబోతుంది. “ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్” పేరుతో తన నిర్మాణ సంస్థని ప్రారంభించి.. కొత్త కథలు వింటూ మొత్తానికి భవిష్యత్తును బాగా ప్లాన్ చేసుకుంటుంది. ఇక ఇప్పటికే “డార్లింగ్స్” అనే టైటిల్ తో తన తొలి సినిమాని నిర్మిస్తోంది. Also Read: నటి హిమజకు లేఖ రాసి సంచలనం సృష్టించిన పవన్ […]

Written By:
  • admin
  • , Updated On : March 1, 2021 / 04:50 PM IST
    Follow us on


    బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కొత్త అవతారం ఎత్తబోతుంది. అవతారం అంటే.. అదే ఎదో కొత్త గెటప్ కాదు, ఆలియా కూడా సినిమా నిర్మాతగా మారబోతుంది. “ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్” పేరుతో తన నిర్మాణ సంస్థని ప్రారంభించి.. కొత్త కథలు వింటూ మొత్తానికి భవిష్యత్తును బాగా ప్లాన్ చేసుకుంటుంది. ఇక ఇప్పటికే “డార్లింగ్స్” అనే టైటిల్ తో తన తొలి సినిమాని నిర్మిస్తోంది.

    Also Read: నటి హిమజకు లేఖ రాసి సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్.. కారణమిదే?

    అన్నట్టు ఈ సినిమాతో జస్మిత్ అనే లేడీ డైరెక్టర్ ని పరిచయం చేస్తోంది. పైగా తను నిర్మాతగానూ చేస్తోన్న ఈ సినిమాలో ఆమె కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. షెఫాలీ షా, విజయ్ వర్మ (‘ఎం సి ఏ’ సినిమాలో విలన్), రోషన్ మేధ్య్స్ మిగిలిన ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాని ఈ రోజునే అలియా భట్ అధికారికంగా ప్రకటించింది. అన్నట్టు ఆలియా తన తొలి సినిమాకి తన ఫెవరెట్ హీరో షారుక్ ఖాన్ తో చేతులు కలిపి.. ఈ సినిమా చేస్తోంది.

    Also Read: ఆమె గ్రేసే ఆ డైరెక్టర్ కి ప్లస్ !

    కాగా షారుక్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా నిర్మాణంలో పార్టనర్ గా వ్యవహరిస్తోంది. అంటే డబ్బులు అలియా భట్ పెట్టినా.. ప్రొడక్షన్ అంతా షారుక్ టీం చూసుకుంటుంది అన్నమాట. అలియా భట్ ఇకపై తన మనసుకు నచ్చే చిన్న చిత్రాలు నిర్మిస్తానంటుంది. “ఆడవాళ్ళని చులకన చెయ్యడం మీ ఆరోగ్యానికి చాలా హానికరం,” అని హెచ్చరిస్తూ చిన్న వీడియోని కూడా విడుదల చేసింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్