https://oktelugu.com/

‘ఖిలాడీ’ ఫస్టు లుక్కుపై రవితేజ ఏమన్నాడంటే?

బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లో సొంతంగా ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరు. సినిమాను ఫ్యాషన్ గా భావిస్తూ దానికోసం ఎంతైనా కష్టపడుతుంటాడు. ఇక తనపై వచ్చే విమర్శలను సైతం రవితేజ సినిమాలతోనే చెక్ పెడుతుంటాడు. రవితేజ న్యూ లుక్ చూస్తే ఔరా అనిపించక మానదు. పాతికేళ్ల కుర్రాడి రవితేజ మారిపోవడంతో అభిమానులంతా అవాక్కయిపోతున్నారు. Also Read: ఆ ఒక్క నిర్ణయం.. నిర్మాతలను గట్టెక్కించనుందా? రవితేజ తాజాగా ‘ఖిలాడీ’ చిత్రం నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీకి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 12:08 PM IST
    Follow us on

    బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లో సొంతంగా ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరు. సినిమాను ఫ్యాషన్ గా భావిస్తూ దానికోసం ఎంతైనా కష్టపడుతుంటాడు. ఇక తనపై వచ్చే విమర్శలను సైతం రవితేజ సినిమాలతోనే చెక్ పెడుతుంటాడు. రవితేజ న్యూ లుక్ చూస్తే ఔరా అనిపించక మానదు. పాతికేళ్ల కుర్రాడి రవితేజ మారిపోవడంతో అభిమానులంతా అవాక్కయిపోతున్నారు.

    Also Read: ఆ ఒక్క నిర్ణయం.. నిర్మాతలను గట్టెక్కించనుందా?

    రవితేజ తాజాగా ‘ఖిలాడీ’ చిత్రం నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్ చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ టీనేజీ కుర్రాడిలా కన్పిస్తున్నాడు. టైట్ ఫిట్ నెక్.. టైట్ ఫిట్ డెనిమ్స్ లో రవితేజ ఇస్మార్ట్ గా కన్పిస్తున్నాడు. ఇప్పటికే రవితేజ ‘క్రాక్’ మూవీ కోసం స్టైలీష్ గా మారిపోయాడు. తాజాగా ‘ఖిలాడీ’ కోసం మరింత ఇస్మార్ట్ తయారవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    ఖిలాడీ పేరుకు తగ్గట్టే రవితేజ పక్కనే పచ్చనోట్లు అలా గాల్లోకి లేచినట్లు చూపించారు. మైండ్ గేమ్ నేపథ్యంలో థ్రిల్లర్ తరహా ‘ఖిలాడీ’ మూవీ తెరకెక్కనుంది. ఇందులో రవితేజ డ్యూయల్ చేయనున్నట్లు సమాచారం. రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి.. డింపుల్ హయతి నటించనున్నారు. మాస్ మహారాజ్ యాక్షన్ కుతోడుగా ఈ ముద్దుగుమ్మల గ్లామర్ సినిమాలకు హైలెట్ నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది.

    ‘ఖిలాడీ’ మూవీ రవితేజకు 67వ మూవీగా రాబోతుంది. ఈ సినిమాకు రమేశ్‌వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తుండగా కొనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ.. రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేయనున్నారు. వచ్చే నెల నుంచి ‘ఖిలాడీ’ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుందని సమాచారం.

    Also Read: బిగ్ బాస్-4: కుమార్ సాయి ఎలిమినేటెడ్?

    ‘ఖిలాడీ’ ఫస్టు లుక్కుపై హీరో రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతి… డైరెక్టర్ రమేశ్ వర్మ స్పందించారు. రవితేజ ‘ఖిలాడీ’ పై స్పందిస్తూ ‘మరో ఎగ్జయిటింగ్‌ జర్నీకి అంతా సిద్ధమైంది’ రవితేజ ట్వీట్ చేశాడు. అదేవిధంగా డింపుల్ హయతి ‘నా తదుపరి చిత్రం మాస్‌ మహారాజా రవితేజతో ఖిలాడీ.. సరికొత్త పాత్రలో కనిపించనున్నాం.. గొప్ప టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగింది.. మీ ఆశీర్వాదాలు కావాలి’ అంటూ ట్వీట్ చేసింది

    డైరెక్టర్ రమేష్ వర్మ స్పందిస్తూ ‘ఖిలాడీలో ఇప్పటివరకు కనిపించని రవితేజను చూస్తారు.. అద్వితీయమైన టాలెంట్‌ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నాను.. మీ ప్రేమ, ఆశీర్వాదాలు’ కావాలంటూ ట్వీట్‌ చేశాడు.