https://oktelugu.com/

వచ్చే నెల 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు

గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో.. తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని అంటుంటారు. ఇప్పుడు ఏపీలో తుంగభద్ర పుష్కరాలకు టైం వచ్చేసింది. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే వారి సంఖ్యను ముందే అంచనా వేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. Also Read: జగన్‌ లేఖలు అమిత్‌ షాకే ఎందుకు..? పుష్కరాలను విజయవంతం చేసేందుకు రూ.199.91 కోట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 12:04 PM IST
    Follow us on

    గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో.. తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని అంటుంటారు. ఇప్పుడు ఏపీలో తుంగభద్ర పుష్కరాలకు టైం వచ్చేసింది. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే వారి సంఖ్యను ముందే అంచనా వేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

    Also Read: జగన్‌ లేఖలు అమిత్‌ షాకే ఎందుకు..?

    పుష్కరాలను విజయవంతం చేసేందుకు రూ.199.91 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. పనులన్నింటినీ నవంబర్‌‌ 16నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. నవంబర్‌‌ 20న ప్రారంభమయ్యే పుష్కరాలు డిసెంబర్‌‌ 1తో ముగుస్తాయి. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను అటు గోదావరి, ఇటు తుంగభద్రకు కూడా నిర్వహిస్తుంటారు. 2008లో అప్పటి సీఎం వైఎస్సార్‌‌ హయాంలో తుంగభద్ర పుష్కరాలను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ మహానేత కుమారుడు వైఎస్‌ జగన్‌ కూడా దేనికీ తీసిపోకుండా ఆ స్థాయిలోనే నిర్వహించాలని తలిచారు.

    తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 20 చోట్ల పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ.22.91 కోట్లు మంజూరు చేసింది. ఈసారి కురిసిన భారీ వర్షాలతో ప్రస్తుతం నది ప్రవాహం కొనసాగుతోంది. పది రోజుల్లో వరద ప్రవాహం తగ్గితే వెంటనే ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. పుష్కర ఘాట్లే కాకుండా.. పేరొందిన ఆలయాలకు వెళ్లేందుకు ఉన్న రోడ్లకు వెంటనే రిపేర్లు చేయనున్నారు. వీటికోసం ఆర్‌‌అండ్‌బీకి రూ.117 కోట్లు, పంచాయతీ రాజ్శాఖకు రూ.30 కోట్లు మంజూరు చేసింది. కర్నూల్‌ టౌన్‌లోనూ, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు పట్టణాల్లోనూ పారిశుధ్యం, అంతర్గత రోడ్లకు కొత్త రూపు తీసుకురావడానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి.

    Also Read: వరద సాయంలో ఏపీ, తెలంగాణ.. ఏది బెటర్?

    పుష్కరాల ఏర్పాట్లపై సీఎం జగన్‌ ఆదేశాల మేరకు కర్నూల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్‌కుమార్‌‌ యాదవ్‌, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రి జయరాం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కర్నూలు కలెక్టర్‌‌ వీరపాండ్యన్‌ నేతృత్వంలో 21 శాఖల అధికారులతో ఏర్పాట్ల కమిటీని ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.