https://oktelugu.com/

నిహారిక పెళ్లి పనులు షూరు.. ఆ మెగా హీరోదే పెత్తనం?

మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులు షూరు అయ్యాయి. దీంతో మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. కరోనా ఎఫెక్ట్ తో ఇటీవలే మెగాడాటర్ నిశ్చితార్థం వేడుకలు చాలా సింపుల్ గానే కనిచ్చేశారు. ఈ వేడుకలో మెగా హీరోలంతా పాల్గొని హంగామా చేశారు. ఇందుకు సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే..! Also Read: ర‌వితేజ‌ ‘ఖిలాడి’ ఫ‌స్ట్ లుక్.. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే నిహారిక పెళ్లిని గ్రాండ్ గా చేయాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 12:40 PM IST
    Follow us on

    మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులు షూరు అయ్యాయి. దీంతో మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. కరోనా ఎఫెక్ట్ తో ఇటీవలే మెగాడాటర్ నిశ్చితార్థం వేడుకలు చాలా సింపుల్ గానే కనిచ్చేశారు. ఈ వేడుకలో మెగా హీరోలంతా పాల్గొని హంగామా చేశారు. ఇందుకు సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెల్సిందే..!

    Also Read: ర‌వితేజ‌ ‘ఖిలాడి’ ఫ‌స్ట్ లుక్..

    కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే నిహారిక పెళ్లిని గ్రాండ్ గా చేయాలని మెగా ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో పెళ్లి ముహుర్తం కుదిరిందనే టాక్ విన్పిస్తోంది. దీనిపై మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించాల్సింది. ఇక పెళ్లి పనులను నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన భుజాన వేసుకొని అన్ని పనులను దగ్గరుండి చేసుకుంటున్నాడు.

    ముద్దుల చెల్లెలు పెళ్లి పనుల కోసం వరుణ్ తేజ్ షూటింగులకు కూడా స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. పెళ్లి అయ్యావరకు షూటింగులకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడట. పెళ్లికి సంబంధించిన లోకేషన్.. ఏర్పాట్లు.. ఖర్చులు వగైరా తదితర కార్యక్రమాలన్నింటిని వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడు. పెళ్లి పనులపై తల్లిదండ్రులతో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సలహాలను పాటిస్తున్నాడట.

    నిహారిక పెళ్లిని హైదరాబాద్లోనే నిర్వహించాలని మెగా ఫ్యామిలీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టాకే పెళ్లి వేడుకను నిర్వహించాలని అందరూ భావిస్తున్నారు. అనవసరంగా రిస్కు తీసుకొని ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని మెగా ఫ్యామిలీ అనుకుంటోంది. ఇంకా పెళ్లి డేట్ అధికారికంగా అనౌన్స్ కానప్పటికీ డిసెంబర్ నాటికి పరిస్థితులు చక్కబడుతాయని భావిస్తున్నారు.

    Also Read: మెగాస్టార్ కు ఏమైంది.. ఇలా ఆలోచిస్తున్నాడు?

    దీంతో అప్పటివరకు పెళ్లి డేట్ ఫిక్స్ చేసి పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని మెగా ఫ్యామిలీ అనుకుంటోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ పెళ్లి పనుల లిస్టును తయారు చేసుకొని తగిన ఏర్పాట్లను చేస్తున్నాడు. ఖర్చుకు ఏమాత్రం వెనుకడకుండా అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడట. అవసరమైనపుడు మెగా సపోర్ట్ తీసుకుంటూ ముందుకెళుతున్నాడు. కరోనా తగ్గడమే ఆలస్యం మెగా ఇంట్లో పెళ్లిభాజ మోగడం ఖాయంగా కన్పిస్తోంది.