హరీష్‌ కథ ముగిసినట్లేనా..?

ట్రబుల్‌ షూటర్‌‌గా పేరొందిన తెలంగాణ మంత్రి హరీష్‌ రావు కథ ముగిసినట్లేనా..? ఒక ఉప ఎన్నికలో ఓటమితో ఆయన భవిష్యత్‌ ప్రశ్నార్థకంలో పడిందా..? అందుకే ఆయనను గ్రేటర్‌‌ ఎన్నికల్లోనూ భావస్వామిని చేయడం లేదా..? అంత పెద్ద బహిరంగకు కూడా అందుకే ఆహ్వానించలేదా..? ఇదీ ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా నడుస్తున్న ట్రోల్స్. Also Read: కేసీఆర్‌‌ వల్లే బీజేపీ బలపడిందా..? మంత్రి హరీష్ రావును టీఆర్ఎస్ పార్టీలో మరోసారి ఘోరంగా అవమానించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. […]

Written By: NARESH, Updated On : November 30, 2020 6:59 pm
Follow us on

ట్రబుల్‌ షూటర్‌‌గా పేరొందిన తెలంగాణ మంత్రి హరీష్‌ రావు కథ ముగిసినట్లేనా..? ఒక ఉప ఎన్నికలో ఓటమితో ఆయన భవిష్యత్‌ ప్రశ్నార్థకంలో పడిందా..? అందుకే ఆయనను గ్రేటర్‌‌ ఎన్నికల్లోనూ భావస్వామిని చేయడం లేదా..? అంత పెద్ద బహిరంగకు కూడా అందుకే ఆహ్వానించలేదా..? ఇదీ ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా నడుస్తున్న ట్రోల్స్.

Also Read: కేసీఆర్‌‌ వల్లే బీజేపీ బలపడిందా..?

మంత్రి హరీష్ రావును టీఆర్ఎస్ పార్టీలో మరోసారి ఘోరంగా అవమానించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. గ్రేటర్‌‌ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రచారసభలో ఆయన ఎక్కడా కనిపించకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. అంత పెద్ద ప్రచారసభలో హరీష్ ఎక్కడా కనిపించలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే కొన్ని గ్రేటర్ డివిజన్ల బాధ్యతలు కూడా చూస్తున్న హరీష్ ను సభలో అసలు పట్టించుకోలేదు. దీంతో ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: కేసీఆర్‌‌కు ఈ ఇద్దరు భయాన్ని పరిచయం చేశారు!

దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకున్నారు హరీష్‌. ఆ ఎన్నికల్లో ఓటమితో తానే ఈ ఓటమికి బాధ్యుడినంటూ ప్రకటించారు. దీంతో అందరి చూపు హరీష్‌ మీదనే పడింది. గతంలోనే కేసీఆర్ జరుగుతున్న ఎన్నికలన్నింటికీ మంత్రులదే బాధ్యతని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు హరీష్‌పై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ.. భవిష్యత్‌లో తీసుకోబోయే అవకాశాలకు మాత్రం తాజా పరిణామాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం: తెలంగాణ పాలిటిక్స్

నిజానికి రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హరీష్ కు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. మంత్రి పదవి కూడా అతి కష్టం మీద లభించింది. దుబ్బాక ఉపఎన్నిక ఓటమితో ఇప్పుడా మంత్రి పదవికి కూడా గండం వచ్చి పడిందన్న చర్చ.. ఎల్బీ నగర్ సభ తర్వాత మరింతగా పెరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. ప్రచారాన్ని ఒంటి చేత్తో నిర్వహించిన కేటీఆర్‌కు అడ్వాంటేజ్ అవుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా దుబ్బాక లాంటి ఫలితం వస్తే.. బీజేపీ హవా ఉంది కాబట్టి.. హరీష్ అయినా.. కేటీఆర్ అయినా ఏమీ చేయలేకపోయారన్న వాదన వినిపించవచ్చు. అంటే ఇప్పుడు గ్రేటర్‌‌ ఎన్నికల ఫలితాల మీదనే హరీష్‌ భవితవ్యం ఆధారపడి ఉందనేది వాస్తవం. ఈ ఫలితాల ఆధారంగానే మరోసారి కేసీఆర్‌‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చనేది సమాచారం.