
ఏదేని మిషన్ రిపేర్‌కు వచ్చిందంటే.. దానికి సంబంధిత ఇంజినీర్‌ని పిలిపించి బాగు చేయిస్తుంటాం. కానీ.. మనిషులమైన మనమే తప్పు చేస్తే వాటిని మనకు మనమే బాగు చేసుకోవాలి. తప్పు అనేది మానవ సహజం. కానీ.. చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేయడం పెద్ద పొరపాటే. రాజకీయంలో అపర చాణక్యుడిగా ముద్రపడిన కేసీఆర్ కూడా అలాంటి తప్పులనే చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read: కేసీఆర్‌కు ఈ ఇద్దరు భయాన్ని పరిచయం చేశారు!
అధికారం దూరంగా ఉన్నప్పుడు ఊరిస్తుంటుంది. ఎప్పుడెప్పుడు అధికారం దొరుకుతుందా అని నేతలు కూడా తహతహలాడుతుంటారు. చివరకు ఆ జిమ్మిక్కులు.. ఈ జిమ్మిక్కులు చేసి అధికారంలోకి వస్తుంటారు. అధికారం చేపట్టాక తమకన్నా మోనార్క్‌లు ఎవరూ లేరని విర్రవీగిపోతుంటారు. తాము అసలు తప్పులే చేయమని భావిస్తారు. అందుకే.. అధికారం చేతికి వచ్చిన తర్వాత చాలామంది లోపాల్ని వినటానికి ఇష్టపడరు. తప్పులు ఎత్తి చూపటాన్ని సైతం సహించరు. ఇందుకు కేసీఆర్ మినహాయింపు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు ఆధిక్యతను ఇచ్చారు. టీఆర్‌ఎస్‌తోపాటే కాంగ్రెస్.. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్.. బీజేపీలు ఉండేవి. ఇలా అయితే భవిష్యత్తులో రాజకీయం చేయటం కష్టమని భావించిన కేసీఆర్.. రాష్ట్రంలో తమ పార్టీ తప్పించి.. మరే పార్టీ ఉనికి ఉండకూడదన్నట్లుగా ఎత్తులు వేశారు.
ఇక కేసీఆర్ వేసిన వ్యూహంలో ఎవరైనా పడాల్సిందే. అందుకే.. రాష్ట్రంలో చాలా పార్టీలు మాయం అయిపోయాయి. చివరకు కాంగ్రెస్ నిలిస్తే.. కొన ఊపిరితో బీజేపీ కొట్టుమిట్లాడే పరిస్థితి. 2018లో జరిగిన ఎన్నికల ఫలితం తీవ్ర నిరాశకు గురి చేస్తే.. అధికార పక్షం పండుగ చేసుకునేలా చేసింది. అయితే.. ఈ దూకుడుకు బ్రేక్ పడింది. 2019 ఎంపీ ఎన్నికల తర్వాత లెక్కలు మారాయి. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కాస్తంత సీన్ ఉందన్న మాటతో పాటు.. బీజేపీకి కూడా బలం ఉందన్న విషయం వెల్లడైంది. తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ ఉనికికోసం పోరాడే పరిస్థితికి వస్తే.. అందుకు భిన్నంగా బీజేపీ నేతలు ఆశావాహ పరిస్థితుల్లోకి వచ్చారు.
Also Read: గ్రేటర్ గెలుపోటములను నిర్ణయించనున్న పోలింగ్ శాతం
సాధారణంగా ఏ పార్టీ కూడా పూర్తిగా మాయం కావాలని ఏ పార్టీ అధినేత కోరుకోరు. కానీ.. భిన్నమైన ఆలోచన ధోరణి ఉన్న కేసీఆర్ మాత్రం కాంగ్రెస్‌ను రాజకీయంగా రాష్ట్రంలో ఖతం చేయాలన్న ఆలోచన వచ్చిందంటారు. అందుకు తగ్గట్లే అప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ తో తమ కారులోకి ఎక్కించేసుకున్నారు. ఉన్నకొద్ది పాటి మందితో అయ్యేది ఏమీ లేదన్న విషయంపై క్లారిటీ వచ్చాక మౌనంగా ఉండిపోయారు.దీంతో రాజకీయ శూన్యత పెరుగుతూనే ఉంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం: తెలంగాణ పాలిటిక్స్
రాష్ట్రంలో రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంటే.. అధికారపక్షానికి దమ్ముగా నిలిచే పార్టీ లేకుండా పోయింది. ఈ అవకాశాన్ని సొంతం చేసుకుంది బీజేపీ. కాలం కలిసి వచ్చినట్లుగా దుబ్బాక ఉప ఎన్నిక రావటం.. అందులో తన సత్తా చాటటంతో.. తనకు తెలీకుండా తనకు పెరిగిన బలాన్ని చూసి కమలనాథులు మురిసిపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ ను ఖతం పెట్టించటం వల్ల తనకు ఎదురైన సవాలు ఏమిటన్నది కేసీఆర్ కు అప్పటికి కానీ అర్థం కాలేదనేది వాస్తవం. ఒకవిధంగా చెప్పాలంటే కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదమే.. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు కారణమైంది.
Comments are closed.