https://oktelugu.com/

తెలంగాణలో కేసీఆర్ కు మళ్లీ పాలాభిషేకాలు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కారు స్పీడుకు హద్దు అదుపులేకుండా పోయింది. రాష్ట్రంలో ఎక్కడ.. ఎలాంటి ఎన్నిక జరిగిన కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. దీంతో రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గట్టెక్కించాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్న పలు నిర్ణయాలు ఇటీవల బెడిసి కొడుతున్నాయి. నియంత్రత సాగు.. ఎల్ఆర్ఎస్.. ధరణి పోర్టల్ లాంటి పథకాలన్నీ ప్రభుత్వంపై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 5:47 pm
    Follow us on

    kcr

    File photo

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కారు స్పీడుకు హద్దు అదుపులేకుండా పోయింది. రాష్ట్రంలో ఎక్కడ.. ఎలాంటి ఎన్నిక జరిగిన కారు జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. దీంతో రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది.

    కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గట్టెక్కించాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్న పలు నిర్ణయాలు ఇటీవల బెడిసి కొడుతున్నాయి.

    నియంత్రత సాగు.. ఎల్ఆర్ఎస్.. ధరణి పోర్టల్ లాంటి పథకాలన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతోన్నాయి. దీంతో సీఎం కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. నియంత్రిత సాగుపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇటీవలే కేసీఆర్ ప్రకటించారు.

    ధరణి పోర్టల్ విషయంలోనూ ప్రభుత్వానికి చాలా తలనొప్పులు వచ్చాయి. కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    జీహెచ్ఎంసీ-2020 ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ‘ఎల్ఆర్ఎస్ పోవాలంటే.. టీఆర్ఎస్ పోవాలని’ నినదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించింది. దీంతో సీఎం కేసీఆర్ ఎల్ఆర్ఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడనే ప్రచారం జరుగుతోంది.

    ఎల్ఆర్ఎస్ నిర్ణయం అమలు చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకతలు వస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఎల్ఆర్ఎస్ లో పలు మార్పులు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

    ప్రజల్లో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు మొదలవుతున్నాయనే సంకేతాలు వచ్చిన ప్రతీసారి సీఎం కేసీఆర్ అనుహ్య నిర్ణయాలతో ఆయా వర్గాలను ఖుషీ చేస్తూ వస్తున్నారు. ఆ సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పాలాభిషేకాలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

    ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ మరోసారి అలాంటి అనుహ్య నిర్ణయాలే తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సైతం పాలాభిషేకాలకు రెడీ అవుతున్నాయనే టాక్ విన్పిస్తోంది.