https://oktelugu.com/

వైరల్: విశాఖ ఉక్కు ఉద్యమంపై చిరంజీవి సంచలన ట్వీట్

విశాఖ ఉక్కు మంటలు టాలీవుడ్ కు పాకాయి. సినీ పరిశ్రమను కూడా కదిలించాయి. ఇప్పటిదాకా ఏపీలోని ఈ అతి పెద్ద సమస్యపై టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ స్పందించలేదు. తాజాగా సినీ ఇండస్ట్రీ పెద్ద దిక్కు మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి మద్దతు ప్రకటించడం సంచలనమైంది. ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమతో ఉన్న అనుబంధాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2021 / 09:22 PM IST
    Follow us on

    విశాఖ ఉక్కు మంటలు టాలీవుడ్ కు పాకాయి. సినీ పరిశ్రమను కూడా కదిలించాయి. ఇప్పటిదాకా ఏపీలోని ఈ అతి పెద్ద సమస్యపై టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ స్పందించలేదు. తాజాగా సినీ ఇండస్ట్రీ పెద్ద దిక్కు మెగా స్టార్ చిరంజీవి స్పందించారు.

    విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి మద్దతు ప్రకటించడం సంచలనమైంది. ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

    ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి సంచలన ట్వీట్ చేశారు.

    ‘విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆ నాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాశాం.

    దాదాపు 35మంది పౌరులతోపాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమం త్యాగం ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడిందని.. కేంద్రం ఈ పరిశ్రమ విషయంలో ప్రైవేటైజేషన్ విరమించుకోవాలని కోరుతున్నట్టు చిరంజీవి తెలిపారు.

    విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రధాన కర్తవ్యం. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన న్యాయ సమ్మతమైన హక్కు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం అని చిరంజీవి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చాడు.