బ్రేకింగ్: టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. తీవ్ర ఉద్రికత్త

టీడీపీకి మరో షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన తన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న కారణంతో మచిలీపట్నం జలాల్ పేట పోలింగ్ కేంద్ర వద్ద రవీంద్ర బైటాయించి నిరసన తెలిపాడు. ఓటు వేసేందుకు వచ్చిన కొల్లుకు, వైసీపీ ఏజెంట్లకు మధ్య వాగ్వాదం నడిచింది. సీఐ శ్రీనివాసరావు ఈ […]

Written By: NARESH, Updated On : March 11, 2021 9:18 am
Follow us on

టీడీపీకి మరో షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన తన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న కారణంతో మచిలీపట్నం జలాల్ పేట పోలింగ్ కేంద్ర వద్ద రవీంద్ర బైటాయించి నిరసన తెలిపాడు. ఓటు వేసేందుకు వచ్చిన కొల్లుకు, వైసీపీ ఏజెంట్లకు మధ్య వాగ్వాదం నడిచింది. సీఐ శ్రీనివాసరావు ఈ వివాదంతో కొల్లు రవీంద్రను వెళ్లిపోవాలని సూచించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీనిపై సీరియస్ అయిన కొల్లు తమను చంపేయాలనుకుంటున్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు పోలీసులపై చేశారు. గెలుపు కోసం మంత్రి పేర్ని నాని దారుణాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

పురపాలక ఎన్నికల సందర్భంగా కొల్లు రవీంద్ర, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై ఆయనను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం తెలియగానే టీడీపీ కార్యకర్తలు భారీగా కొల్లు రవీంధ్ర ఇంటికి చేరుకున్నారు. మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక కొల్లు రవీంద్ర అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. దొంగ ఓట్లు వేసుకున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని.. ప్రశ్నించిన కొల్లు రవీంద్రలాంటి బీసీ నేతలను సీఎం జగన్ అణిచివేస్తున్నాడని చంద్రబాబు విమర్శించాడు.