https://oktelugu.com/

ఉగ్రరూపంలో విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ రిలీజ్ డేట్ ఇదే..

కరోనా కల్లోలంతో బ్రేక్ పడిన ‘లైగర్’ చిత్రం తిరిగి పట్టాలెక్కింది. ముంబైలో కరోనా వైరస్ విస్తృతి కారణంగా లైగర్ బృందం షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి చాలా సమయం తీసుకుంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు ప్రధాన నటి అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ తదితరులు ముంబైలో జరిగే కొత్త షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈ బృందం తాజాగా సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు సరికొత్త […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2021 / 09:14 AM IST
    Follow us on

    కరోనా కల్లోలంతో బ్రేక్ పడిన ‘లైగర్’ చిత్రం తిరిగి పట్టాలెక్కింది. ముంబైలో కరోనా వైరస్ విస్తృతి కారణంగా లైగర్ బృందం షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి చాలా సమయం తీసుకుంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు ప్రధాన నటి అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ తదితరులు ముంబైలో జరిగే కొత్త షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.

    ఈ బృందం తాజాగా సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు సరికొత్త పోస్టర్‌తో థియేట్రికల్ విడుదల తేదీని ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో చేతిలో ఒక శూలం లాంటిది పట్టుకొని కోపం అరుస్తూ విజయ్ దేవరకొండ ఉగ్రంగా కనిపిస్తున్నాడు. స్పోర్ట్ వెస్ట్ .. ట్రాక్ ప్యాంటుతో, పొడవాటి జుట్టుతో విజయ్ వీరావేశంతో కనిపిస్తున్నాడు.

    థాయ్ లాండ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన ప్రత్యర్థితో బాక్సింగ్ రింగ్‌లో పోరాడుతుండటం కనిపిస్తోంది. వెనుకాల విజయ్ ను ఉత్సాహపరిచేందుకు భారీగా జనం ఉన్నారు. విడుదల పోస్టర్ చాలా గంభీరంగా ఉంది.. ఈ చిత్రం ఎలా ఉంటుందో పోస్టర్ ద్వారా కనిపిస్తోంది.

    పూరి సినిమాలో ఎవరున్నారో కూడా ఇప్పటిదాకా బయటపెట్టడం లేదు. తన ప్రధాన నటులను చూపించడంలో నిపుణుడైన పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండను పూర్తిగా భిన్నమైన మరియు ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇందులోని తారాగణం మాత్రం బయటపడడం లేదు.

    పూరి జగన్నాధ్, చార్మ్ కౌర్, కరణ్ జోహార్ మరియు అపుర్వ మెహతా కలిసి ప్యాన్ ఇండియా మూవీగా దాదాపు ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.