https://oktelugu.com/

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బన్నీకి మరో సరికొత్త రికార్డ్ !

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ‌‘అల వైకుంఠపురంలో’ సినిమా ఇంకా రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూనే ఉంది. సినిమా బ్లాక్ ‌బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా రిలీజ్ కాకముందే.. పాటలు, ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుని.. సినిమా రిలీజ్ అయ్యాక కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ ను దాటుకుని మొత్తానికి ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో బుట్టబోమ్మ పాట సంచలనం సృష్టించగా.. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 11, 2021 / 10:08 AM IST
    Follow us on


    స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ‌‘అల వైకుంఠపురంలో’ సినిమా ఇంకా రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూనే ఉంది. సినిమా బ్లాక్ ‌బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా రిలీజ్ కాకముందే.. పాటలు, ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుని.. సినిమా రిలీజ్ అయ్యాక కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ ను దాటుకుని మొత్తానికి ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో బుట్టబోమ్మ పాట సంచలనం సృష్టించగా.. ఈ సినిమా ట్రైలర్‌ సైతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షకులను సంపాదించిన సంగతి తెలిసిందే.

    Also Read: యాంకర్ రవి పర్సనల్ చాట్ ను పబ్లిక్ చేసిన వర్షిణి

    అయితే తాజాగా ఈ సినిమాలోని‌ ‘రాములో రాములా’ పాట కూడా మరో అరుదైన రికార్డును సాధించింది. ఈ ఫుల్‌ వీడియో సాంగ్‌ ఇప్పటి వరకూ 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ దక్కించుకుంది. పైగా ఇంకా మంచి వ్యూస్ తో దూసుకుపోతూ ఉంది. మొత్తానికి ఈ సాంగ్ యూట్యూబ్‌ సెన్సేషనల్‌ గా మారింది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫి అందించిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణీ, మంగ్లీలు అద్భుతంగా ఆలపించారు. ఏది ఏమైనా ఈ సినిమా సాంగ్స్ తోనే సరికొత్త సంచనాలను సృష్టించుకుంటూ పోతూ ఉంది. ఈ క్రమంలో బన్నీ క్రేజ్ ను రోజురోజుకూ పెరిగిపోతుంది.

    Also Read: హిట్లు కోసం ప్లాప్ హీరోగారి పాట్లు !

    కాగా తన స్టైలిష్‌ లుక్ తో‌, తన ఈజీ యాక్టింగ్‌ తో బన్నీ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. ఇక ప్రస్తుతం ఈ స్టైలిష్ స్టార్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల అవ్వనుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. బన్నీ ఈ సినిమాను వీలయినంత ఫాస్ట్ గా రెడీ చేసి, కొరటాల శివతో సినిమాని మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్