https://oktelugu.com/

ఆ ఇద్దరు టీఆర్ఎస్ మంత్రులే షర్మిలను నడిపిస్తున్నారా..?

వైఎస్ షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీలోకి టీఆర్ఎస్ నాయకులు వలస వెళ్లనున్నారా..? ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఆమెతో టచ్ లో ఉన్నారా..? ఆ ఇద్దరు మంత్రులు వలస వెళితే టీఆర్ఎస్ పార్టీ షేక్ కానుందా..? అంటే నిజమనే వాదనలు పుట్టుకొస్తున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు షర్మల వెంట నడిచేందుకు రెడీ అవుతున్నారన్న విషయం బయటకు రావడంతో తీవ్ర చర్చ సాగుతోంది. తెలంగాణలో గత కొన్ని రోజుల తరువాత రాజకీయ వేడి సంతరించుకుంది. దివంగత ముఖ్యమంత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2021 8:54 am
    Follow us on

    వైఎస్ షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీలోకి టీఆర్ఎస్ నాయకులు వలస వెళ్లనున్నారా..? ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఆమెతో టచ్ లో ఉన్నారా..? ఆ ఇద్దరు మంత్రులు వలస వెళితే టీఆర్ఎస్ పార్టీ షేక్ కానుందా..? అంటే నిజమనే వాదనలు పుట్టుకొస్తున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు షర్మల వెంట నడిచేందుకు రెడీ అవుతున్నారన్న విషయం బయటకు రావడంతో తీవ్ర చర్చ సాగుతోంది.

    తెలంగాణలో గత కొన్ని రోజుల తరువాత రాజకీయ వేడి సంతరించుకుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పార్టీపై తీవ్ర చర్చ సాగుతోంది. ఆమె మంగళవారం వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ తాను కొత్త పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు. కానీ ఈ సమావేశాలు రాజకీయం కోసమేనన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. మరోవైపు కేసీఆర్, జగన్ సహకారంతోనే షర్మిల ఈ సమావేశాలు నిర్వహిస్తోందంటున్నారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు మంత్రులు షర్మిలకు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

    దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం తగ్గినట్లయింది. దీంతో బీజేపీ బలపడుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో అంసతృప్తిగా ఉన్న కొందరు నేతలు బీజేపీకి లోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే ఆ పార్టీ మతతత్వ పార్టీ అని ముద్ర పడడంతో పాటు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నేత కావడంతో కొందరు అగ్ర కులాలకు చెందిన వారు వెనుకడుగు వేసినట్లు సమాచారం. ఈ తరుణంలో షర్మిల కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఫిబ్రవరి 10న షర్మిల పార్టీ ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు మంత్రులు ఈ పార్టీలోకి వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట.

    ప్రగతిభవన్ లో గత ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ సొంత పార్టీ నేతలపైనే నిప్పులు చెరిగారు. ఎవరైనా సీఎం మార్పు గురించి మాట్లాడితే బండకేసి కొడుతా లాంటి మాటలను వాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము బానిసల్లా ఉంటున్నామని నిరాశతో ఉన్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ ఇలా అనేసరికి మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారట. ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలాంటి మాటలు పడాల్సిన అవసరమేంటి..? అని అనుకుంటున్నారట.

    ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక మంత్రులు షర్మిల పార్టీలోకి వెళితే తమకు న్యాయం జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారట. తాము ఇంతకాలం మంత్రులమై ఉండి ఏ పని చేసుకోవడం లేదని, అన్నీ కేసీఆర్ తప్ప తమని ఏం చేయనివ్వడం లేదని తమ సన్నిహితుల వద్ద వాపోయారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉండేదని, ఆయన ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలకు, మంత్రులకు విలువనిచ్చేవారని చెప్పుుకుంటున్నారట. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీలోకి వెళితే తమకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్న గౌరవం దక్కే అవకాశాలున్నాయని భావిస్తున్నారట. తామే కాకుండా తమతో పాటు కార్యకర్తలను కొత్త పార్టీలోకి తీసుకెళితే వారికి కూడా అవకాశాలు దొరికవచ్చని అనుకుంటున్నారట. మరి షర్మిల పార్టీ పెడితే ఆ ఇద్దరు మంత్రులు జంప్ కానున్నారా..? దీంతో టీఆర్ఎస్ షేక్ కానుందా..? లేదా..? చూడాలి.