https://oktelugu.com/

నిరుద్యోగులకు ఎల్‌అండ్‌టీ శుభవార్త.. 1100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..!

ప్రముఖ సంస్థలలో ఒకటైన ఎల్‌అండ్‌టీ సంస్థ యువ ఇంజనీర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1100 యువ ఇంజనీర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీటెక్ చదివిన విద్యార్థులను, పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఎల్‌అండ్‌టీ సంస్థ నియమించుకోనుందని తెలుస్తోంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఎల్‌అండ్‌టీ ప్రకటన వల్ల ప్రయోజనం చేకూరనుంది. అయితే ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ ఉద్యోగాలలో మెజారిటీ ఉద్యోగాలను ఐఐటీ, ఎన్‌ఐటీల నుంచి నియమించుకోనుందని సమాచారు. Also Read: వారికి ఎంఎస్ఎంఈ శుభవార్త.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2020 10:51 am
    Follow us on

    LARSEN & TOUBRO
    ప్రముఖ సంస్థలలో ఒకటైన ఎల్‌అండ్‌టీ సంస్థ యువ ఇంజనీర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1100 యువ ఇంజనీర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీటెక్ చదివిన విద్యార్థులను, పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఎల్‌అండ్‌టీ సంస్థ నియమించుకోనుందని తెలుస్తోంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఎల్‌అండ్‌టీ ప్రకటన వల్ల ప్రయోజనం చేకూరనుంది. అయితే ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ ఉద్యోగాలలో మెజారిటీ ఉద్యోగాలను ఐఐటీ, ఎన్‌ఐటీల నుంచి నియమించుకోనుందని సమాచారు.

    Also Read: వారికి ఎంఎస్ఎంఈ శుభవార్త.. భారీ వేతనంతో నోటిఫికేషన్ విడుదల..!

    దాదాపు 90 శాతం మంది అభ్యర్థులు ఆ సంస్థలకు చెందిన వారే ఉంటారని మిగిలిన 10 శాతం మంది అభ్యర్థులు మాత్రం ఇతర విద్యా సంస్థల నుంచి ఉద్యోగాలకు ఎంపిక కానున్నారని సమాచారం. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తొంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభించనుంది. ఎల్‌అండ్‌టీ సంస్థ సీఈవో సుబ్రమణ్యన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

    Also Read: బీటెక్ విద్యార్థులకు విప్రో బంపర్ ఆఫర్.. మూడున్నర లక్షల వేతనంతో ఉద్యోగం..?

    ఇప్పటికే ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కాగా 1100 ఉద్యోగాలలో 250 ఉద్యోగాలకు ఐఐటి, ఎన్.ఐ.టీ విద్యార్థులు ఎంపికయ్యారని సమాచారం. ఎల్‌అండ్‌టీ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుసగా వెలువడుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ ఏడాది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. మరోవైపు కేంద్రం సైతం కొత్తకొత్త స్కీమ్ లను అమలు చేస్తూ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.