
గత మార్చి నెల నుంచి దేశంలో కరోనా కల్లోలం మొదలైంది. ఆ మహమ్మారి వైరస్ ధాటికి లాక్ డౌన్ విధించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా.. కరోనా మనల్ని వదిలిపోనే లేదు. మనలోని చాలా మందిని బలితీసుకుంది.
Also Read: దేశీ వ్యాక్సిన్లు నీళ్లతో సమానమట..: అప్పుడే బడా కంపెనీల నెగెటివ్ ప్రచారం
దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడిప్పుడే తీవ్రత తగ్గి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే కరోనా కొత్త స్ట్రెయిన్ వచ్చి మళ్లీ బ్రిటన్ లాంటి దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రజలకు ఊరటనిచ్చేలా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ విడుదలైంది.
అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లు అక్కడి ప్రజలకు అందుబాటులోకి రాగా.. మన దేశంలో ఆక్స్ ఫర్డ్, భారత్ బయోటెక్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి దేశంలో అత్యవసర అనుమతికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకికేంద్రం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని పదిరోజుల్లోనే మొదలు పెట్టనున్నట్లు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ అనుమతి పొందిన జనవరి 3వ తేదీ నుంచి పదిరోజుల్లోపే టీకా పంపిణీ ప్రారంభిస్తామని తెలిపింది.
Also Read: ఇండియాలో కరోనా అందుకే తగ్గుముఖం పట్టిందా..?
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రత్యేక టీకా నిల్వకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ కేంద్రాల్లో వ్యాక్సిన్లను తక్కువ ఉష్ణోగ్రతల్లో ఉంచి పర్యవేక్షించే వీలుంటుందని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మొత్తం 37 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ నుంచి ఆయా ప్రాంతాలకు టీకా సరఫరా చేస్తామని తెలిపారు. దేశంలోని ప్రధాన టీకా నిల్వ కేంద్రాలైన హర్యానాలోని కర్నల్, ముంబై, చెన్నై, కోల్ కతా, నగరాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా జిల్లాస్థాయి, ప్రాథమిక స్థాయి ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేస్తామని వెల్లడించారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్