https://oktelugu.com/

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై రెండు గ్రాముల బంగారం..?

  తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. కళ్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునే మహిళలకు రెండు గ్రాముల బంగారంతో తాళిబొట్టును ఇవ్వనుంది. గతంలో ఒక గ్రాము తాళిబొట్టు బంగారం ఇచ్చిన టీటీడీ ప్రస్తుతం బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచడం గమనార్హం. కళ్యాణమస్తు కార్యక్రమం కొరకు టీటీడీ ట్రెజరీలో ఉన్న 20,000 బంగారు తాళిబొట్టులను వినియోగించుకోనుంది. Also Read: సూర్యకుమార్ ఔట్ పై దుమారం.. ఔట్ కాదంటూ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 19, 2021 / 05:28 PM IST
    Follow us on

     

    తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. కళ్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునే మహిళలకు రెండు గ్రాముల బంగారంతో తాళిబొట్టును ఇవ్వనుంది. గతంలో ఒక గ్రాము తాళిబొట్టు బంగారం ఇచ్చిన టీటీడీ ప్రస్తుతం బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచడం గమనార్హం. కళ్యాణమస్తు కార్యక్రమం కొరకు టీటీడీ ట్రెజరీలో ఉన్న 20,000 బంగారు తాళిబొట్టులను వినియోగించుకోనుంది.

    Also Read: సూర్యకుమార్ ఔట్ పై దుమారం.. ఔట్ కాదంటూ మాజీల ఫైర్

    పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమం కోసం ఇప్పటికే ముహూర్తాలు ఖరారు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమం అమలు జరగగా పదేళ్ల క్రితం కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది. టీటీడీ ఆగిపోయిన కార్యక్రమాన్ని పునః ప్రారంభించి భక్తులకు ప్రయోజనం చేకూరుస్తుండటం గమనార్హం.

    Also Read: వేగంగా విజృంభిస్తున్న ఫంగస్.. కరోనా కంటే ప్రమాదమా..?

    మే 28, అక్టోబర్ 30, నవంబర్ 17్ తేదీలలో కళ్యాణమస్తు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఈవో జవహర్ రెడ్డి నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. టీటీడీ పాలకమండలి సమావేశంలో కళ్యాణమస్తు నిర్వహించే ప్రాంతాలకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. 2011 మార్చిలో రద్దైన ఈ కార్యక్రమం సీఎం జగన్ హయాంలో మళ్లీ ప్రారంభమవుతూ ఉండటం గమనార్హం.

    ఆర్థిక భారం పెరగడం, సిబ్బంది చేతివాటం, ఇతర కారణాల వల్ల గతంలో కళ్యాణమస్తు కార్యక్రమం రద్దైన సంగతి తెలిసిందే. టీటీడీ అర్చకులు కళ్యాణమస్తు లగ్నపత్రికని స్వామివారి పాదాల చెంత వుంచి పూజలు నిర్వహించారు.