https://oktelugu.com/

అరె..’బాలయ్య సినిమా’కి దూరం దూరం !

నట సింహం అని ‘బాలయ్య బాబు’కి బిరుదు అయితే మిగిలిపోయింది గానీ, బాలయ్య నటనను ఇష్టపడేవారు మాత్రం రోజురోజుకూ తగ్గిపోతున్నారు. దీనికితోడు, బాలయ్య అభిమానులు కూడా బాలయ్య సినిమాల పై అంచనాలు పెట్టుకోవడం ఎప్పుడో మానేశారు. లేకపోతే బోయపాటి – బాలయ్య కాంబినేషన్ కి క్రేజ్ ఉన్నా వ్యూస్ రాకపోవడం ఏమిటి ? ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. అయినా ఒక మీడియమ్ రేంజ్ హీరో సినిమా టీజర్ లానే బాలయ్య సినిమా టీజర్ […]

Written By: , Updated On : March 19, 2021 / 05:29 PM IST
Follow us on

Balakrishna
నట సింహం అని ‘బాలయ్య బాబు’కి బిరుదు అయితే మిగిలిపోయింది గానీ, బాలయ్య నటనను ఇష్టపడేవారు మాత్రం రోజురోజుకూ తగ్గిపోతున్నారు. దీనికితోడు, బాలయ్య అభిమానులు కూడా బాలయ్య సినిమాల పై అంచనాలు పెట్టుకోవడం ఎప్పుడో మానేశారు. లేకపోతే బోయపాటి – బాలయ్య కాంబినేషన్ కి క్రేజ్ ఉన్నా వ్యూస్ రాకపోవడం ఏమిటి ? ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. అయినా ఒక మీడియమ్ రేంజ్ హీరో సినిమా టీజర్ లానే బాలయ్య సినిమా టీజర్ నిలిచింది.

ఇక బాలయ్య సినిమాలో ఒక కీలక పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం ఒక యంగ్ హీరోని తీసుకోవాలని ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవీన్ పోలిశెట్టి నుండి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వరకూ చాల మంది పేర్లు వినిపించాయి. ఆ హీరో ఈ హీరో నటించబోతున్నాడంటూ రూమర్స్ కూడా బాగా వినిపించాయి. కానీ, చివరకు ఏ హీరో బాలయ్య సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.

అయితే ఇంటర్వెల్ లో వచ్చే ఈ పోలీస్ ఆఫీసర్ పాత్ర సినిమాకే కీలకం అని తెలుస్తోంది. కేవలం రెండు సీన్స్ లో మాత్రమే సినిమాలో కనిపించినా.. కథను మలుపు తిప్పే పాత్ర అట. ఇది మూగ – చెమిటి పాత్ర అని.. నలభై నిమషాల పాటు సాగే ఈ కీలక పాత్రలో క్రేజీ హీరో నాగశౌర్య నటించబోతున్నాడని ఓ వార్త బాగా వైరల్ అయింది. కానీ ఆ తరువాత ఈ న్యూస్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సహజంగా బాలయ్య సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతాడు కాబట్టి.. ఏ హీరో ఒప్పుకోవడం లేదేమో.

కాగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. బాలయ్యకు ‘సింహ’ ‘లెజెండ్’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి, ఈ సారి ఆ సినిమాలను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.