క్రేజీ కాంబినేషన్ కి సన్నాహాలు.. ఫ్యాన్స్ కి పండగే !

కొన్ని కాంబినేషన్ లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వీరి కలయికలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. కరోనా కాలంలో విడుదలైన ఈ మూవీ తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ ఏడాది ‘మాస్టర్’ తప్ప మరో హిట్ లేదు తమిళ చిత్రసీమకి. అందుకే, విజయ్ మరోసారి ఆ దర్శకుడితో చేతులు కలపడానికి రెడీ అవుతున్నాడు. Also Read: […]

Written By: admin, Updated On : March 19, 2021 6:53 pm
Follow us on


కొన్ని కాంబినేషన్ లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వీరి కలయికలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. కరోనా కాలంలో విడుదలైన ఈ మూవీ తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ ఏడాది ‘మాస్టర్’ తప్ప మరో హిట్ లేదు తమిళ చిత్రసీమకి. అందుకే, విజయ్ మరోసారి ఆ దర్శకుడితో చేతులు కలపడానికి రెడీ అవుతున్నాడు.

Also Read: విజ‌య్ దేవ‌ర‌కొండ థియేట‌ర్లో.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బొమ్మ‌!

అయితే ప్రస్తుతం విజయ్, నెల్సన్ దిలీప్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ తో కొత్త సినిమా తీస్తున్నాడు, ఈ సినిమా పై పెద్దగా పాజిటివ్ బజ్ అయితే రావడం లేదు. కారణం కొత్త దర్శకుడు అవ్వడమే అని విజయ్ ఫీల్ అవుతున్నాడు. అందుకే ఈ సారి విజయ్ తన తరువాత దర్శకుడి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇది విజయ్ ఖాతాలో 65వ చిత్రం. ఇక 66వ చిత్రాన్ని తీసే బాధ్యతని లోకేష్ కనగరాజ్ కి ఇచ్చాడట. లోకేష్ స్పీడ్ గా సినిమాలు తీస్తాడు.

Also Read: మెగాస్టార్ కి ఈ వయసులో ఒకేసారి రెండు అంటే.. ?

కాగా ‘మాస్టర్’ సినిమాలో హీరోయిజమ్ తప్ప కథలో దమ్ము లేదని విమర్శకులు వచ్చినా.. విజయ్ ఇంకా అతన్నే నమ్మడం నిజంగా విశేషమే. నిజానికి లోకేష్ కథల్లో కొత్తదనం ఉంటుంది. అందుకే కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే సినిమాని లోకేష్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాని త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు లోకేష్. అయితే ప్రస్తుతం ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తమిళనాడు ఎన్నికలు ముగిసిన వెంటనే తిరిగి ప్రారంభం అవుతుందట. కమల్ సినిమాని నాలుగు నెలల్లో పూర్తి చేసి వెంటనే విజయ్ సినిమా స్టార్ట్ చేయాలని లోకేష్ ప్రస్తుతానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్