https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ‘దిశ’ హత్యోదంతంను కళ్లకు కట్టారు!

హైదరాబాద్ లో అత్యాచారం.. ఆ తర్వాత దారుణ హత్యకు గురైన ‘దిశ’ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.. వైద్య విద్యార్థిని ట్రాప్ చేసిన నలుగురు లారీ డ్రైవర్లు, కీనర్లు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం దారుణంగా కాల్చి చంపేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దీనిపై దుమారం రేగింది. తెలంగాణ పోలీసులు ఆ నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ లో కాల్చిచంపారు. హత్యాచారానికి పాల్పడిన నిందితులకు తక్షణ శిక్ష విధించి దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2020 / 12:40 PM IST
    Follow us on

    హైదరాబాద్ లో అత్యాచారం.. ఆ తర్వాత దారుణ హత్యకు గురైన ‘దిశ’ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.. వైద్య విద్యార్థిని ట్రాప్ చేసిన నలుగురు లారీ డ్రైవర్లు, కీనర్లు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం దారుణంగా కాల్చి చంపేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దీనిపై దుమారం రేగింది. తెలంగాణ పోలీసులు ఆ నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ లో కాల్చిచంపారు. హత్యాచారానికి పాల్పడిన నిందితులకు తక్షణ శిక్ష విధించి దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహ జ్వాలలకు ముగింపు పలికారు.

    Also Read: ఎస్పీ బాలు తిట్టడం వల్లే మెగాస్టార్ ఇలా మారాడా?

    అయితే ఎవ్వరూ మరిచిపోని ఆ సంఘటనను సినిమాగా తీశాడు వివాదాస్పద రాంగోపాల్ వర్మ. 2019 నంబర్ 26న చోటుచేసుకున్న ఈ హత్యాచారంను కళ్లకు కట్టాడు. వివాదాలతో సావాసం చేసే వర్మ తాజాగా దిశ హత్యోదంతంను కళ్లకు గట్టినట్టు చూపించారు.

    వర్మ ఈ సంఘటనపై తీస్తున్న ‘దిశ-ఎన్ కౌంటర్’ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూస్తే ఆద్యంతం ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది స్పష్టంగా చూపించారు. అదేప్రాంతంలో షూటింగ్ చేయడం.. ఆ సంఘటనను ఎంతో సహజ సిద్ధంగా వర్మ తీయడం విశేషం.

    ఎంతో రద్దీగా ఉండే ఆ రోడ్ లో దిశను ఎలా ట్రాప్ చేసింది.. ఎలా ఎత్తుకుపోయింది. ఎలా హత్యాచారం చేసింది.. ఎలా చంపిందో కళ్లకుగట్టారు. పెట్రోల్ పోసి తగులబెట్టడం.. కెమెరా వర్క్ బాగా చూపించారు. ఆ తర్వాత పోలీసుల ఎన్ కౌంటర్ ను బుల్లెట్ శబ్ధాలతో చూపించి సినిమాను క్లోజ్ చేశారు.ఈ ట్రైలర్ చూపించినట్టు కనుక సినిమా ఉంటే దేశవ్యాప్తంగా హిట్ కొట్టడం పక్కా..

    Also Read: చిరంజీవితోపాటు అందరికీ షాకిచ్చిన రాంచరణ్‌..!

    ఈ సినిమాను ఆర్జీవీ సారథ్యంలో ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. నట్టి కరుణ, క్రాంతి నిర్మించారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.