https://oktelugu.com/

ఆ ఆరుగురే ఎమ్మెల్సీ అభ్యర్థులు.. జగన్ డిసైడ్?

ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల వాతావరణ ఉండనుంది. మొన్నటి వరకు పంచాయతీ ఎలక్షన్లో సందడి చేసిన రాజకీయ పార్టీలు ఇక ఎమ్మెల్సీ ఎన్నికలవైపునకు వెళ్లనున్నాయి. రాష్ట్రంలోని ఆరు స్థానాల్లో ఎమ్మెల్సీల పదవీకాలం ముగిననుండడంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలయింది. కాగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలో వైసీపీ గెలిచే అవకాశమే కనిపిస్తోంది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ ఎవరిపై దయ చూపుతుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు టికెట్ కోసం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 24, 2021 / 02:37 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల వాతావరణ ఉండనుంది. మొన్నటి వరకు పంచాయతీ ఎలక్షన్లో సందడి చేసిన రాజకీయ పార్టీలు ఇక ఎమ్మెల్సీ ఎన్నికలవైపునకు వెళ్లనున్నాయి. రాష్ట్రంలోని ఆరు స్థానాల్లో ఎమ్మెల్సీల పదవీకాలం ముగిననుండడంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలయింది. కాగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలో వైసీపీ గెలిచే అవకాశమే కనిపిస్తోంది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ ఎవరిపై దయ చూపుతుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అధిష్ఠానం అభ్యర్థుల విషయంలో ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్సీగా ఉన్న మహ్మద్ ఇక్బాల్ పదవీకాలం ముగియనుంది. అయితే మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ కు ప్రత్యర్థిగా ఉన్న ఇక్బాల్ టీడీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అంతేకాకుండా మైనార్టీ వర్గానికి టికెట్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్న జగన్ మళ్లీ ఆయనకే అవకాశం ఇస్తారని అంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఆయన స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో ఆయన కుమారుడు భగీరథకు ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నారట.

    ఇకగుంటూరు జిల్లాకు చెందిన లేల్ల అప్పిరెడ్డి కూడా రేసులో ముందున్నారు. మొన్నటి ఎన్నికలో ఈయన బీసీ టికెట్ ను వదులుకున్నారు. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో పార్టీని నడిపించడంలో ముందున్నారు. అయితే ఈయనకు పోటీగా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కూడా ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి దక్కుతుందో చూడాలి.

    బీసీల నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట. అందులో ఒకరు మహిళ ఉండనున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన వీరభద్రరావుకు తిరిగి పార్టీలోకి చేరినా టెకెట్ ఇవ్వలేదు. బీసీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు లేదా కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.

    మరోవైపు కాళింగ సామాజిక వర్గానికి ఓ సీటు కేటాయించనున్నారు సీఎం. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరారు. అయితే 2014, 2019లో టికెట్ వదులుకున్న వరుదు కళ్యాణి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఈమె శ్రీకాకుళం జిల్లాలో పార్టీని భుజాన వేసుకొని నడిపించారు. కానీ రెండు ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. అటు మంత్రి వర్గంలోనూ కొప్పల సామాజిక వర్గానికి చోటివ్వలేదు. దీంతో కళ్యాణికి టికెట్ ఇచ్చి ఆ భర్తీ చేయనున్నారు.

    అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. బల్లి దుర్గా ప్రసాద్ ఇటీవల మరణించారు. దీంతో ఆయన కుమారుడికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు దక్కే అవకాశాున్నాయని అంటున్నారు. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో వీరే ఉంటారా..? ఇతరులను చేరుస్తారా..? అన్న చర్చ తీవ్రమైంది.