https://oktelugu.com/

ఇప్ప‌టికీ రిలీజ్ కాని.. జూ.ఎన్టీఆర్ మొదటి సినిమా తెలుసా?

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ మొద‌టి సినిమా ఏదీ..? అంటే చాలా మంది ‘నిన్ను చూడాల‌ని’ అని చెప్తారు. లోతుగా తెలిసిన వారు ‘బాల రామాయణం’ అని చెప్తారు. కానీ.. అంతకన్నా ముందు ఓ సినిమాలో జూనియర్ నటించాడు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు! అంతేకాదు.. ఈ సినిమాలో సీనియ‌ర్ ఎన్టీఆర్‌, న‌ట‌సింహం బాల‌య్య కూడా న‌టించారు! అయితే.. ఆ సినిమా రిలీజ్ కాక‌పోవ‌డం విచార‌క‌రం. Also Read: నేచురల్ స్టార్ నాని.. ప్రేక్షకులు […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 24, 2021 / 03:01 PM IST
    Follow us on


    యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ మొద‌టి సినిమా ఏదీ..? అంటే చాలా మంది ‘నిన్ను చూడాల‌ని’ అని చెప్తారు. లోతుగా తెలిసిన వారు ‘బాల రామాయణం’ అని చెప్తారు. కానీ.. అంతకన్నా ముందు ఓ సినిమాలో జూనియర్ నటించాడు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు! అంతేకాదు.. ఈ సినిమాలో సీనియ‌ర్ ఎన్టీఆర్‌, న‌ట‌సింహం బాల‌య్య కూడా న‌టించారు! అయితే.. ఆ సినిమా రిలీజ్ కాక‌పోవ‌డం విచార‌క‌రం.

    Also Read: నేచురల్ స్టార్ నాని.. ప్రేక్షకులు నిలబెట్టిన నటుడు..!

    ఎన్టీఆర్ వార‌సుడిగా సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన బాల‌కృష్ణ‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొన‌సాగుతున్నారు. ఇక‌, తాత వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌న‌దైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తే చూడాల‌ని నంద‌మూరి ఫ్యాన్స్ ఎప్ప‌ట్నుంచో ఆరాట‌ప‌డుతున్నారు. కానీ.. ఇంత‌కుముందే వీళ్లిద్ద‌రూ క‌లిసి న‌టించిన విష‌యం చాలా కొద్దిమందికి తెలుసు.

    సీనియర్ ఎన్టీఆర్ స్వీయ‌ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ అనే సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలోనూ తెర‌కెక్కించారు‌. తెలుగు వెర్షన్ లో బాలకృష్ణ.. హరిశ్చంద్రుడు, దుశ్యంతుడు పాత్రల్లో నటించారు. హిందీలో కూడా బాలయ్య అవే క్యారెక్ట‌ర్ల‌లో న‌టించారు. అయితే.. హిందీ వెర్ష‌న్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో భరతుడి క్యారెక్టర్ వేశాడు తారక్. ఇదే జూనియ‌ర్ మొద‌టి సినిమాగా చెప్పుకోవ‌చ్చు. ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా సమయంలో జూ. ఎన్టీఆర్ హిందీ చ‌క్క‌గా మాట్లాడ‌టం చూసి హిందీ వెర్షన్ లోకి తీసుకున్నార‌ట‌.

    Also Read: విడుదలకు రంగులద్దుకుంటున్న ‘రంగ్ దే’

    అయితే.. ఈ సినిమా తెలుగులో దారుణ ప‌రాజ‌యం పాలైంది. దీంతో.. అప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ అయిన‌ప్ప‌టికీ.. హిందీ వెర్ష‌న్ రిలీజ్ చేయ‌కుండా ఆపారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత ఆయ‌న‌ రాజకీయాలతో బిజీ అయ్యారు. అనంత‌ర కాలంలో టీడీపీలో సంక్షోభం కూడా ఏర్ప‌డింది. ఇలాంటి కారణాలతో ఈ సినిమా రిలీజ్ కాకుండానే అలా మిగిలిపోయింది.

    ఆ లెక్క ప్ర‌కారం.. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోని మొద‌టి సినిమా రిలీజ్ కాకుండా మిగిలిపోయింది. అది కూడా సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణతో క‌లిసి న‌టించిన సినిమా కావ‌డం విశేషం. మూడు త‌రాల నంద‌మూరి హీరోలు క‌లిసి న‌టించిన‌ప్ప‌టికీ.. యాదృశ్చికంగా విడుద‌ల‌కు నోచుకోలేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్