https://oktelugu.com/

మేయర్ రేసులో ‘ఆ నలుగురూ..’ లాబీయింగ్.. కేసీఆర్ దే ఫైనల్

జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకి హైదరాబాదీలు మెజార్టీ ఇవ్వలేదు. హంగ్ వచ్చేసింది. దీంతో పొత్తుల సంసారంలోనే ఇక నెట్టుకురావాల్సిందే. గ్రేటర్ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ కు ఈ ఫలితాలు మింగుడు పడడం లేదు. అధిక డివిజన్లు టీఆర్ఎస్ గెలిచినప్పటికీ మేయర్ పీఠానికి సరిపడా సంఖ్య లేదు. ఎక్స్ అఫీషియో ఓట్ల మీద కూడా మేయర్ పీఠం దక్కే అవకాశాలు లేవు. దీంతో మేయర్ స్థానం కోసం ఖచ్చితంగా మజ్లిస్ సహకారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2020 9:53 am
    Follow us on

    GHMC mayor

    జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకి హైదరాబాదీలు మెజార్టీ ఇవ్వలేదు. హంగ్ వచ్చేసింది. దీంతో పొత్తుల సంసారంలోనే ఇక నెట్టుకురావాల్సిందే. గ్రేటర్ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ కు ఈ ఫలితాలు మింగుడు పడడం లేదు. అధిక డివిజన్లు టీఆర్ఎస్ గెలిచినప్పటికీ మేయర్ పీఠానికి సరిపడా సంఖ్య లేదు. ఎక్స్ అఫీషియో ఓట్ల మీద కూడా మేయర్ పీఠం దక్కే అవకాశాలు లేవు. దీంతో మేయర్ స్థానం కోసం ఖచ్చితంగా మజ్లిస్ సహకారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు టీఆర్ఎస్ కు సంకటంగా మారింది. మజ్లిస్ తో వెళితే బీజేపీకి ఆయుధంగా మారుతుంది. మరింతగా హిందూ ఓట్లను బీజేపీ మళ్లించుకుంటుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఏం నిర్ణయిస్తారన్నది ఆసక్తిగా మారింది.

    Also Read: జిహెచ్ఎంసి ఫలితాల సారాంశం/పాఠాలు

    ప్రస్తుతం టీఆర్ఎస్ కు పెద్దగా సీట్లు రాకపోవడం.. మజ్లిస్ పార్టీ భారీగానే సీట్లు సాధించడంతో ఈ రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లపాటు మేయర్ పదవిని పంచుకునేలా రొటేషన్ పద్ధతిలో అధికారం చెలాయించే అవకాశాలు ఉన్నాయి. మజ్లిస్ ఇప్పటికే దీన్ని తెరమీదకు తెస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి మరో అవకాశం లేకపోవడంతో దీన్ని అంగీకరించడం తప్ప మరో మార్గం లేదంటున్నారు. ఇదివరకు కాంగ్రెస్-మజ్లిస్ ఇలాగే చేశాయి.

    మేయర్ పదవి ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. టీఆర్ఎస్ లో ఈ పదవి కోసం పోటీ నెలకొంది. ప్రధానంగా మాజీ మంత్రి పీ జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచారు.

    ఇక టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ , రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ కూడా ఈ కేసులో ఉన్నట్టు చెబుతున్నారు. ఆమె బంజారాహిల్స్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్తిగా గెలిచారు.కేసీఆర్ కు కేశవరావుపై సానుకూల అభిమానం ఉండడంతో ఈమెకు చాన్స్ ఉండొచ్చు అంటున్నారు. అయితే ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇవ్వకపోవచ్చు అంటున్నారు.

    Also Read: జీహెచ్ఎంసీ మేయర్ పదవీ ఆమెనే వరించనుందా?

    ఇక మేయర్ రేసులో మళ్లీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి పేరు కూడా వినిపిస్తోంది. చర్లపల్లి నుంచి ఆమె విజయం సాధించారు.కేసీఆర్ కుటుంబానికి ఆప్తుడనే పేరుంది.

    ఇక వీరే కాదు.. తెరపైకి కొత్త పేరు కూడా వచ్చింది. సింధు ఆదర్శ్ రెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. సింధు ఆదర్శ్ రెడ్డి భారతీనగర్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. సీఎం నుంచి ఆమెకు పిలుపు రావడంతో సింధు ఎంపిక లాంఛనమేననే టాక్ విన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్