చుండ్రును నివారించడానికి పాటించాల్సిన చిట్కాలు ఇవే..?

మనలో చాలామందిని వేధించే సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి. వాతావరణంలో వేడి, కాలుష్యం వల్ల చాలామంది చుండ్రు సమస్య బారిన పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. చుండ్రు వెంట్రుకల అందంతో పాటు ఆరోగ్యాన్ని సైతం పాడు చేస్తుంది. చుండ్రు సమస్యతో బాధ పడే వాళ్లలో జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది. Also Read: గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..? వేపాకు చుండ్రు సమస్యను […]

Written By: Navya, Updated On : December 5, 2020 12:50 pm
Follow us on


మనలో చాలామందిని వేధించే సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి. వాతావరణంలో వేడి, కాలుష్యం వల్ల చాలామంది చుండ్రు సమస్య బారిన పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. చుండ్రు వెంట్రుకల అందంతో పాటు ఆరోగ్యాన్ని సైతం పాడు చేస్తుంది. చుండ్రు సమస్యతో బాధ పడే వాళ్లలో జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుంది.

Also Read: గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

వేపాకు చుండ్రు సమస్యను తగ్గించడంలో మంచి ఫలితాలను ఇస్తుంది. చుండ్రు పెరగడానికి కారణమయ్యే ఫంగస్ ను నివారించడంలో వేపాకు సహాయపడుతుంది. రాత్రి సమయంలో వేపాకును వేడి నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తల స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. చుండ్రును అరికట్టడంలో ఆపిల్ సీడర్ వెనిగర్ సైతం అద్భుతంగా పని చేస్తుంది. నీళ్లు, వెనిగర్ సమపాళ్లలో కలిపి షాంపూలా చేసుకుని చుండ్రు సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

Also Read: పిస్తా పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

ఎక్కువ గాఢత ఉన్న షాంపూలను వాడినా కొన్ని సందర్భాల్లో చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తక్కువ గాఢత ఉన్న షాంపూలను మాత్రమే ఎంచుకుంటే మంచిది. ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు సైతం చుండ్రును అరికట్టడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. ఆస్పిరిన్ ట్యాబ్లెట్లను పొడిగా చేసుకుని ఆ పొడిని షాంపూతో కలిపి తలకు పట్టించినా చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

కొబ్బరి నూనెకు టీ ట్రీ ఆయిల్ ను కలిపి మాడుకు పట్టించినా సులభంగా చుండ్రుకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి కొన్ని నిమిషాల తరువాత స్నానం చేసినా చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. పులిసిన పెరుగున మాస్క్ లా వేసుకున్నా చుండ్రు సమస్య దూరమవుతుంది.