కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్.. ఆ వ్యాధి వచ్చే ఛాన్స్..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా బారిన పడితే నెగిటివ్ వచ్చినా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నా కొన్ని అవయవాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా కొనసాగుతూ ఉండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామంది కరోనా న్యుమోనియా బారిన పడుతున్నారు. Also Read: వాటితో కరోనాకు చెక్.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన..? సాధారణ న్యుమోనియాతో పోల్చి చూస్తే […]

Written By: Navya, Updated On : December 5, 2020 1:05 pm
Follow us on


భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా బారిన పడితే నెగిటివ్ వచ్చినా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నా కొన్ని అవయవాలపై వైరస్ ప్రభావం ఎక్కువగా కొనసాగుతూ ఉండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామంది కరోనా న్యుమోనియా బారిన పడుతున్నారు.

Also Read: వాటితో కరోనాకు చెక్.. శాస్త్రవేత్తల సంచలన ప్రకటన..?

సాధారణ న్యుమోనియాతో పోల్చి చూస్తే కరోనా న్యుమోనియా చాలా ప్రమాదకరమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ బారిన పడితే ఏ విధమైన లక్షణాలు కనిపిస్తాయో కరోనా న్యుమోనియాలో సైతం అదే తరహా లక్షణాలు కనిపిస్తాయి. కరోనా న్యుమోనియాలో సాధారణంగా కనిపించే కరోనా లక్షణాలతో పాటు ఆయాసం, దగ్గు ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి.

Also Read: వ్యాక్సిన్ వచ్చినా కరోనా వైరస్ అదుపులోకి రాదా..?

కరోనా న్యుమోనియా బారిన పడ్డ వారికి ఆక్సిజన్ ను అందించడం లేదా వెంటిలేటర్ పై చికిత్స అందించడం ద్వారా సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. అయితే కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ఈ సమస్య బారిన పడతారని చెప్పలేం కానీ వయస్సు పైబడిన వాళ్లు మాత్రం ఎక్కువగా ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు కరోనా న్యుమోనియా లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా కరోనా న్యుమోనియాకు చెక్ పెట్టవచ్చు. కరోనా న్యుమోనియాలో వైరస్ లేదా బ్యాక్టీరియా లంగ్స్ టిష్యూలపై ప్రభావం చూపడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు ఉంటాయి.