https://oktelugu.com/

చంద్రబాబు, జగన్, పవన్ భవిష్యత్ ను తేల్చే ‘పురపోరు’ ఇదీ!

పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచింది.? ఎవరు ఓడిపోయింది తెలియదు. ఎందుకంటే గెలిచిన వారంతా అభివృద్ధి కోణంలో అంతా తాము వైసీపీనే అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీనే మెజార్టీ సీట్లు సాధించిందని చెబుతున్నారు. 80 సీట్లు తామే గెలిచామని ప్రకటించింది. టీడీపీ తమకు 40 శాతం ఓట్లు అన్నాడు. ఇక జనసేనాని పవన్ అయితే తమకు 27శాతం ప్రజలు ఓట్లేశారన్నారు. ఇవన్నీ కలిపితే 147 శాతం మరీ.. ఇదో కామెడీ.. కానీ ఈసారి అధికార వైసీపీ, ప్రతిపక్షాలు తప్పించుకోలేవు. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2021 / 09:44 AM IST
    Follow us on

    పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచింది.? ఎవరు ఓడిపోయింది తెలియదు. ఎందుకంటే గెలిచిన వారంతా అభివృద్ధి కోణంలో అంతా తాము వైసీపీనే అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీనే మెజార్టీ సీట్లు సాధించిందని చెబుతున్నారు. 80 సీట్లు తామే గెలిచామని ప్రకటించింది. టీడీపీ తమకు 40 శాతం ఓట్లు అన్నాడు. ఇక జనసేనాని పవన్ అయితే తమకు 27శాతం ప్రజలు ఓట్లేశారన్నారు. ఇవన్నీ కలిపితే 147 శాతం మరీ.. ఇదో కామెడీ.. కానీ ఈసారి అధికార వైసీపీ, ప్రతిపక్షాలు తప్పించుకోలేవు. ప్రతిపక్ష టీడీపీ బలం తెలిసిపోతుంది. మధ్యలో జనసేన బలం కూడా తెలుస్తుంది.

    ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ట్విస్ట్ ఏంటంటే ఈ ఎన్నికలు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లాగానే పార్టీల ఎన్నికల గుర్తుపై జరుగుతాయి. అంటే ఈ ఓట్ల ఫలితం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. రెండేళ్ల జగన్ పాలన బాగుందో లేదో ప్రజలు తీర్పునిస్తారు. చంద్రబాబు పడుతున్న తాపత్రయం ఫలిస్తుందో లేదో చెబుతారు. జనసేనాని 27శాతం ఓటు బ్యాంకు నిజమో కాదో తేటతెల్లం అవుతుంది.

    ఇక చంద్రబాబు 2019లో ఓడిపోయినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని మోడీపై విమర్శించాడు. వైసీపీకి సహకరించారని ఢిల్లీ వేదికగా రచ్చ చేశాడు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు తప్పించుకోలేరు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల మీదే జరుగుతున్నాయి. పైగా పార్టీల గుర్తుల మీదే సాగుతున్నాయి.

    ఏపీ మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా రెండేళ్ల వైసీపీ పాలనకు రెఫరెండంగా నిలుస్తాయి. వైసీపీ గెలిస్తే జగన్ పై ప్రజలు విశ్వాసం ఉంచినట్టే. ఇక టీడీపీ గెలిస్తే జగన్ పాలనపై వ్యతిరేకత మొదలైటనట్టేగా గుర్తించారు. ఓడిపోయిన వేళ ఈవీఎంలను నిందించిన చంద్రబాబుకు ఇప్పుడు కారణం చెప్పడానికి ఏం ఉండదు. ఇక జనసేనాని పార్ట్ టైం పాలిటిక్స్ కథ ఏంటో మున్సిపల్ ఎన్నికల్లో తేటతెల్లమవుతోంది. ఆయన రాజకీయంగా ముందుకెళ్లాలో వద్దో కూడా ఈ ఎన్నికలు చెబుతాయి.

    పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రజలు కొంచెం తెలివైనవారు. వారికి మంచి చెడూ తెలుసు. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలను గమనించగలరు. అందుకే ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. అందుకే చంద్రబాబు, వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చి ప్రచారం చేస్తుంది. ఈ ఎన్నికలతోనే ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది తేటతెల్లం అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో విజేతలే రాబోయే ఏపీ పాలకులని స్పష్టమవుతుంది.