https://oktelugu.com/

శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాలి!

నవగ్రహాలలో ఒకటైన శని గ్రహానికి శనివారం ఎంతో ప్రీతికరమైన రోజు. శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే శనివారం శనీశ్వరునికి ప్రత్యేకమైన పూజలు చేయాలి. సాధారణంగా శనీశ్వరుడు జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు కారకుడని ఎంతో మంది భావిస్తుంటారు. ఒక్కసారి శని ప్రభావం మనపై ఉంది అంటే మన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందుకోసమే కొంతమంది శనీశ్వరుని పేరు చెబితేనే భయపడుతుంటారు. అయితే ఇవన్నీ కేవలం వారి అపోహలు మాత్రమే. కానీ శనీశ్వరుని భక్తి భావాలతో పూజిస్తే మనకున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2020 9:07 am
    Follow us on

    నవగ్రహాలలో ఒకటైన శని గ్రహానికి శనివారం ఎంతో ప్రీతికరమైన రోజు. శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే శనివారం శనీశ్వరునికి ప్రత్యేకమైన పూజలు చేయాలి. సాధారణంగా శనీశ్వరుడు జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు కారకుడని ఎంతో మంది భావిస్తుంటారు. ఒక్కసారి శని ప్రభావం మనపై ఉంది అంటే మన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందుకోసమే కొంతమంది శనీశ్వరుని పేరు చెబితేనే భయపడుతుంటారు. అయితే ఇవన్నీ కేవలం వారి అపోహలు మాత్రమే. కానీ శనీశ్వరుని భక్తి భావాలతో పూజిస్తే మనకున్న ఏలినాటి శని తొలిగిపోయి సుఖ సంతోషాలతో గడుపుతారు.

    సాధారణంగా శని దోషాలతో బాధపడేవారు శని దోషం నుంచి విముక్తి కలగాలంటే శనీశ్వరుని శాంతింపజేసి స్వామివారి అనుగ్రహం పొందటం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఆ శనీశ్వరుని అనుగ్రహం పొందాలంటే, శనీశ్వరునికి ఇష్టమైన రోజు శనివారం, నల్లటి లేదా నీలిరంగు పువ్వులంటే శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి. శని త్రయోదశి రోజు శనీశ్వరుని నీలి రంగు పుష్పాలు, నల్లటి పువ్వులతో పూజించి, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చు.

    ఈ విధంగా శనీశ్వరుని భక్తి భావాలతో పూజించడంవల్ల శనీశ్వరుని అనుగ్రహం కలిగి శని దోష నివారణ తొలగిపోవడమే కాకుండా ఎన్నో సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. శనీశ్వరుని ఈశ్వరుడి అంశంగా భావిస్తారు కాబట్టి, ఎప్పుడు శని అని పిలవకుండా శనీశ్వరుడు అని మాత్రమే పిలవాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.