https://oktelugu.com/

అమ్మ మాటే శాసనం.. రాహుల్ కే కాంగ్రెస్ పగ్గాలు..!

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వయస్సు భారం.. అనారోగ్య కారణాలతో ఏఐసీసీ చీఫ్ పదవీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ స్థానాన్ని తన కుమారుడు రాహుల్ గాంధీకి కట్టబెట్టాలని ఆమె ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. Also Read: రైతు చట్టాలను చదవండి.. దేశ ప్రజలకు లేఖ షేర్ చేసిన మోడీ అయితే రాహుల్ మాత్రం దీనికి ససేమేరా అంటున్నాడు. కాంగ్రెస్ పగ్గాలు ఇతరుల చేతికి వేలితో ఎలాంటి పరిణామాలు ఉంటాయో ముందుగానే అంచనా వేసి సోనియాగాంధీ తానే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 20, 2020 / 08:57 AM IST
    Follow us on

    కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వయస్సు భారం.. అనారోగ్య కారణాలతో ఏఐసీసీ చీఫ్ పదవీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ స్థానాన్ని తన కుమారుడు రాహుల్ గాంధీకి కట్టబెట్టాలని ఆమె ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

    Also Read: రైతు చట్టాలను చదవండి.. దేశ ప్రజలకు లేఖ షేర్ చేసిన మోడీ

    అయితే రాహుల్ మాత్రం దీనికి ససేమేరా అంటున్నాడు. కాంగ్రెస్ పగ్గాలు ఇతరుల చేతికి వేలితో ఎలాంటి పరిణామాలు ఉంటాయో ముందుగానే అంచనా వేసి సోనియాగాంధీ తానే తిరిగి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.

    అయితే ఇటీవల ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఏఐసీసీ అధ్యక్షుడి నియామకంపై గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ లో జోరుగా చర్చ నడుస్తోంది.

    ఇటీవల కాంగ్రెస్ కు చెందిన 23మంది అసమ్మతి నేతలు కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ సోనియాగాంధీ బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీలో రాహుల్ నాయకత్వం.. ఇతర పరిస్థితులపై అధిష్టానం దృష్టిసారించింది.

    Also Read: మద్దతు ధరపై హామీ ఇస్తాం..: రైతులకు కేంద్ర మంత్రి లేఖ

    అయితే కాంగ్రెస్ నేతలు బహిరంగ లేఖ రాయడంతో కాంగ్రెస్ లో విబేధాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పగ్గాలు ఇతరుల చేతికి వెళుతుందనే క్రమంలో సోనియాగాంధీనే పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను తీసుకోవడంతో వివాదం సర్దుమణిగింది.

    తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 23మంది అసమ్మతి నేతలు..ఇంకా విధేయులతో శనివారం సమావేశం నిర్వహించారు. నెలరోజులుగా పార్టీలో జరుగుతున్న విబేధాలు.. పొరపాట్లపై చర్చించి రాజీదిశగా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

    ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ సారథ్యాన్ని కాంగ్రెస్ నేతలు కోరడంతో పార్టీ కోసం తాను పని చేసేందుకు రెడీ అంటూ ప్రకటించారు. ఎట్టకేలకు రాహుల్ గాంధీ సోనియాగాంధీ వారసత్వాన్ని కొనసాగించే సిద్ధపడటంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్