https://oktelugu.com/

శ్రీకాళహస్తి గుడి దర్శనం తర్వాత ఈ తప్పు చేస్తున్నారు?

మనం ఏదైనా తీర్థ యాత్రలకు వెళ్ళినప్పుడు, విహార యాత్రలకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అన్నింటిని చూసుకొని వస్తుంటారు. అలాగే తిరుపతి దేవాలయాన్ని దర్శించి భక్తులు అందరూ తప్పకుండా తిరుపతి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను దర్శించి ఇంటికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే కానీపాకం, అలివేలు మంగాపురం, గోవిందరాజ స్వామి గుడి, శ్రీకాళహస్తి వంటి దేవాలయాలను దర్శించుకుంటాము. ఈ విధంగా అన్ని దేవాలయాలను దర్శించి తర్వాత శ్రీకాళహస్తి దేవాలయాన్ని దర్శించి అక్కడ ఉన్న దేవుని దర్శన భాగ్యం కలిగాక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2020 / 09:13 AM IST
    Follow us on

    మనం ఏదైనా తీర్థ యాత్రలకు వెళ్ళినప్పుడు, విహార యాత్రలకు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అన్నింటిని చూసుకొని వస్తుంటారు. అలాగే తిరుపతి దేవాలయాన్ని దర్శించి భక్తులు అందరూ తప్పకుండా తిరుపతి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను దర్శించి ఇంటికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే కానీపాకం, అలివేలు మంగాపురం, గోవిందరాజ స్వామి గుడి, శ్రీకాళహస్తి వంటి దేవాలయాలను దర్శించుకుంటాము.

    ఈ విధంగా అన్ని దేవాలయాలను దర్శించి తర్వాత శ్రీకాళహస్తి దేవాలయాన్ని దర్శించి అక్కడ ఉన్న దేవుని దర్శన భాగ్యం కలిగాక మరే దేవాలయానికి వెళ్ళకూడదని ఆధ్యాత్మిక పండితుల చెబుతున్నారు. అలా చేయడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని తెలియజేశారు. మన విశ్వంలో ఉన్న పంచభూతాలకు అనుగుణంగా పంచలింగాలు వెలిసాయి. అందులో ఒకటి వాయు లింగం.

    జాతక దోషంలో ఏమైనా కాల సర్పదోషాలున్న, రాహు కేతు దోషాలున్న శ్రీకాళహస్తీశ్వర దేవాలయం దర్శించుకున్న ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా సర్ప దోష నివారణ జరగాలంటే ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఆ విధంగా పూజలు నిర్వహించిన తర్వాత మరి ఏ దేవాలయానికి అయినా వెళితే ఆ దోష పరిహారం జరగదని పండితులు తెలియజేస్తున్నారు. అందుకోసమే శ్రీ కాళహస్తి దేవాలయాన్ని దర్శించిన తర్వాత మరి దేవాలయాలకు వెళ్లకూడదని చెబుతున్నారు.

    ఈ శని ప్రభావం, గ్రహ ప్రభావం ఆ శివుడిపై తప్ప మిగిలిన అన్ని దేవుళ్ళ పై ఉంటుంది. అందుకోసమే చంద్రగ్రహణ సమయంలో అన్ని దేవాలయాలు గ్రహణ సమయంలో మూత పడినప్పటికీ, శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం గ్రహణ సమయంలో కూడా తెరిచి ఉంటుంది. అంతేకాకుండా గ్రహణ సమయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. అందుకే శ్రీకాళహస్తిని దర్శించిన తర్వాత మరే దేవాలయాన్ని దర్శించ కూడదని చెబుతారు.