https://oktelugu.com/

మోగిన గ్రేటర్ ఎన్నికల నగారా.. డిసెంబర్ 1 పోలింగ్.. పార్టీల బలాలివే

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్‌‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగింది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఈనెల 18,19,20నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు..21న నామినేషన్ల పరిశీలిస్తారని తెలిపారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 4 న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికలకు కేవలం 13 రోజులు మాత్రమే గ్యాప్ పెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఆగమేఘాల మీద నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 / 11:45 AM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్‌‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగింది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఈనెల 18,19,20నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు..21న నామినేషన్ల పరిశీలిస్తారని తెలిపారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 4 న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికలకు కేవలం 13 రోజులు మాత్రమే గ్యాప్ పెట్టడంతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఆగమేఘాల మీద నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

    Also Read: కమలం ‘గ్రేటర్’ ఆపరేషన్..కారు పరేషాన్

    ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎన్నికల కమిషన్ కూడా రెడీ అయిపోయింది. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 1న నిర్వహిస్తున్నారు. 18న నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. 3న ఎక్కడైనా రిపోల్ నిర్వహిస్తారు.

    కాగా.. దుబ్బాక ఓటమి నేపథ్యంలో ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను టీఆర్‌‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక ఓటమి బాధ నుంచి బయటపడాలంటే గ్రేటర్‌లో కచ్చితంగా 100 పైచిలుకు డివిజన్లు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దుబ్బాకలో బీజేపీ గెలుపు స్థానిక అభ్యర్థి రఘునందన్ రావుపై ఉన్న సానుభూతే తప్ప.. అది బీజేపీ బలం కాదని నిరూపించాలనుకుంటోంది. ఇందుకోసం ఎమ్మెల్యేలకు టార్గెట్లు ఫిక్స్ చేసింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్ని డివిజన్లు టీఆర్ఎస్ ఖాతాలోనే చేరాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది.

    Also Read: జనసేనలోకి మళ్లీ జేడీ.. పక్కా హామీ ఇస్తేనేనట..!

    మరోవైపు.. దుబ్బాక ఉపఎన్నికలో గెలుపుతో అటు బీజేపీ కూడా ఊపు మీద ఉంది. ఒకవేళ అక్కడ బీజేపీ బోల్తా కొట్టి ఉంటే.. గ్రేటర్‌లో ఆ పార్టీని టీఆర్ఎస్ లైట్ తీసుకుని ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. జీహెచ్ఎంసీ ఎన్నికలు దేశ ద్రోహులకు, దేశభక్తులకు మధ్య యుద్ధం అంటూ ఇప్పటికే అగ్గి రాజేశారు. ఎంఐఎంతో అంటకాగుతున్న టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పి తీరుతామని అంటున్నారు. దుబ్బాకలో ఏ స్ట్రాటజీ అయితే వాడారో.. ఇక్కడ కూడా ఆ పద్ధతినే అనుసరించాలని చూస్తున్నారు. గ్రేటర్‌‌ పై కాషాయం జెండా ఎగురేసి టీఆర్‌‌ఎస్‌కు షాక్‌ ఇవ్వాలని భావిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా ఉంది. ఏ ఎన్నికల్లోనూ సత్తా చాటలేకపోతోంది. కనీసం డిపాజిట్లు కూడా పొందలేని దుస్థితి నెలకొంది. గ్రేటర్‌లోనూ కాంగ్రెస్ బీజేపీ కంటే వెనుకబడితే.. ఆ పార్టీ ఉనికికే ప్రమాదం తలెత్తే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసితో ఆ పార్టీ ఉంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్,బీజేపీలు ముందస్తు ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడినట్లే కనిపిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ నేతలకు గాలం వేస్తున్నారు.