https://oktelugu.com/

వెంకీ – వరుణ్ ‘ఎఫ్ 3’కి ముహూర్తం ఖరారు !

డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటేనే ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఎవరు నెంబర్ వన్ అనేగానే ప్రస్తుతం అనిల్ రావిపూడి పేరే ముందువరుసలో ఉంటుంది. అంతగా అనిల్ తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. తనదైన రైటింగ్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ […]

Written By:
  • admin
  • , Updated On : November 17, 2020 / 11:52 AM IST
    Follow us on


    డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటేనే ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఎవరు నెంబర్ వన్ అనేగానే ప్రస్తుతం అనిల్ రావిపూడి పేరే ముందువరుసలో ఉంటుంది. అంతగా అనిల్ తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. తనదైన రైటింగ్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండాల్సిన ఈ సినిమా.. కరోనా దెబ్బకు మొదలవ్వకుండానే ఆగిపోయింది.

    Also Read: కరోనా కంటే.. బాలయ్యే ఎక్కువ భయపెడుతున్నాడు !

    అయితే ప్రస్తుతం అన్ని సినిమాలు షూటింగ్ మూడ్ లో ఉన్నాయి. అందుకే ఈ సినిమాని కూడా మొదలుపెట్టాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసాడు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబులు ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ కూడా విన్నారు. స్క్రిప్ట్ వారికి బాగా నచ్చింది. అందుకే తమ బ్యానర్స్ లో ఇప్పటికే అరడజను సినిమాల పెండింగ్ లతో సతమతమవుతున్నా… ఎఫ్ 3 సినిమాని డిసెంబర్ 25న అధికారకంగా లాంచ్ చేసి వెంటనే షూట్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    Also Read: హోస్ట్ గా ఒకప్పటి హాట్ హీరోయిన్.. !

    అయితే ప్రస్తుతం వెంకీ నారప్పతో, వరుణ్ తేజ్ బాక్సర్ తో మరో నెల రోజులు వరకూ ఫుల్ బిజీగా ఉంటారు. అంటే ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరు హీరోలు ఎఫ్ 3 మీదకు రానున్నారు. ఇక వచ్చే ఏడాది నుండి సినిమా పూర్తయ్యేవరకూ తమ డేట్స్ ను ఎఫ్ 3 కే కేటాయిస్తారట. ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి తన తరువాత సినిమాని బాలయ్యతో చేయాలనే ఒప్పదం ఒకటి ఉంది. గతంలో బాలకృష్ణ హీరోగా ‘రామారావుగారు’ అనే ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ లో అనిల్ రావిపూడి బాలయ్యకి ఓ కథ చెప్పాడు. ఆ కథతోనే బాలయ్యతో సినిమా చేయనున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్