https://oktelugu.com/

శ్రీవారి భక్తులకు శుభవార్త

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త తెలిపింది. స్లాటెడ్ సర్వదర్శనం టికెట్ల జారీని శనివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభించింది. వైకుంఠం ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం ఒక్కరోజే ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. కానీ ఈసారి డిసెంబర్ 25 నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. తొలుత స్థానికులకే వైకుంఠ సర్వదర్శన టికెట్లను ఇవ్వగా తాజాగా క్యూలైన్లలో ఉన్నవారికి సైతం స్లాటెడ్ టికెట్లను అందిస్తున్నారు. ఈ టికెట్లను తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, టీటీడీ విష్ణు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 3, 2021 / 09:00 AM IST
    Follow us on

    శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త తెలిపింది. స్లాటెడ్ సర్వదర్శనం టికెట్ల జారీని శనివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభించింది. వైకుంఠం ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం ఒక్కరోజే ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. కానీ ఈసారి డిసెంబర్ 25 నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. తొలుత స్థానికులకే వైకుంఠ సర్వదర్శన టికెట్లను ఇవ్వగా తాజాగా క్యూలైన్లలో ఉన్నవారికి సైతం స్లాటెడ్ టికెట్లను అందిస్తున్నారు. ఈ టికెట్లను తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, టీటీడీ విష్ణు నివాసం కాంప్లెక్స్ లో అందించారు.