ఎన్టీఆర్ ‘షావుకారు’ వెనకున్న అసలు కథ !

తెలుగు సినీ ప్రపంచంలో ‘షావుకారు’ సినిమా ఒక గొప్ప క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. విజయా వారి నుండి వచ్చిన అద్భుతమైన ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందట. మొదట ఈ సినిమాకి ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం చేద్దామనుకుని.. షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు, చక్రపాణి పట్టుబట్టి షూటింగ్ జరగకుండా చేసేవారట. అల రెండుసార్లు జరిగిందట. నిర్మాత నాగిరెడ్డికి కథ నచ్చినా, మరో నిర్మాత చక్రపాణికి అసలు కథ నచ్చలేదట. దాంతో ఎల్.వి.ప్రసాద్ చేసేదేమి లేక చక్రపాణి […]

Written By: admin, Updated On : April 2, 2021 7:07 pm
Follow us on


తెలుగు సినీ ప్రపంచంలో ‘షావుకారు’ సినిమా ఒక గొప్ప క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. విజయా వారి నుండి వచ్చిన అద్భుతమైన ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందట. మొదట ఈ సినిమాకి ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం చేద్దామనుకుని.. షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు, చక్రపాణి పట్టుబట్టి షూటింగ్ జరగకుండా చేసేవారట. అల రెండుసార్లు జరిగిందట. నిర్మాత నాగిరెడ్డికి కథ నచ్చినా, మరో నిర్మాత చక్రపాణికి అసలు కథ నచ్చలేదట. దాంతో ఎల్.వి.ప్రసాద్ చేసేదేమి లేక చక్రపాణి అభిరుచికి తగ్గట్లు కథలో మార్పులు చేశారు.

అయితే ఎల్.వి.ప్రసాద్ చేసిన మార్పులు ఈ సారి నాగిరెడ్డికి నచ్చలేదట. దాంతో ఇక ఈ కథను ఇక్కడికే వదిలేసి.. ఇంకో కథ మీద కూర్చుంటా అంటూ ఎల్.వి.ప్రసాద్ మరో స్క్రిప్ట్ పై వర్క్ చేయడం మొదలుపెట్టారు. కానీ చక్రపాణి – నాగిరెడ్డి ఇద్దరూ కథ పై కూర్చుని ఒక మాట మీదకు వచ్చి 1949 చివర్లో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకి ఎంత వెతికినా హీరో దొరకలేదు అట.

అప్పటికే ఫామ్ లో ఉన్న అక్కినేనిను హీరో పెట్టాలని ఆలోచన చేసినా.. ఎల్.వి.ప్రసాద్ మనసులో మాత్రం మొదటి నుండి ఎన్టీఆరే ఉన్నారు. అలా షావుకారు జానకి – నందమూరి తారక రామారావు కలయికలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 1950న ఏప్రిల్ 7న విదుదలైన ఈ సినిమా అలాగే అప్పట్లో ఈ సినిమా కథ కూడా జనానికి బాగా కనెక్ట్ అయింది. అయితే సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు గానీ, ఎన్టీఆర్ ను మాత్రం హీరోగా నిలబెట్టింది.

కాగా ఈ చిత్రకథలో మరో గమ్మత్తు ఏమిటంటే.. ప్రతి నాయకుడి పాత్ర విచిత్రంగా ఉంటుంది. విలన్‌ గా అనిపిస్తూ భావోద్వేగాలను పండిచేపాత్ర అది. అందుకే మొదటి నుండి ప్రసాద్ గారు ఈ పాత్రపై మక్కువ పెంచుకున్నారు. బహుశా ఆ కారణంగానే మనుషుల నమ్మకాల మద్య, అనుభందాల మద్య ఉండే విషయాలను చూపిస్తూ, మాట పట్టింపులను బట్టి మనుషులు మనస్తత్వాలు ఎలా మార్చుకొంటారో కూడా చాలా అందంగా చూపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్