https://oktelugu.com/

పేటీఎం ఆఫర్.. సిలిండర్ పై రూ.800 డిస్కౌంట్..?

ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ లలో ఒకటైన పేటీఎం ఏప్రిల్ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై అదిరిపోయే ఆఫర్ ను అందిస్తోంది. పేటీఎం అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా భారీగా తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 800 రూపాయల నుంచి 900 రూపాయల మధ్యలో ఉంది. పేటీఎం యాప్ ద్వారా సిలిండర్ బుకింగ్ చేసేవాళ్లకు గరిష్టంగా 800 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 2, 2021 5:19 pm
    Follow us on

    Paytm Gas Booking Offer

    ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ లలో ఒకటైన పేటీఎం ఏప్రిల్ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై అదిరిపోయే ఆఫర్ ను అందిస్తోంది. పేటీఎం అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా భారీగా తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 800 రూపాయల నుంచి 900 రూపాయల మధ్యలో ఉంది. పేటీఎం యాప్ ద్వారా సిలిండర్ బుకింగ్ చేసేవాళ్లకు గరిష్టంగా 800 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది.

    Also Read: ఎస్బీఐ సూపర్ పాలసీ.. రూ.100తో రూ.2 కోట్లు ..?

    ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయి కొత్తగా సిలిండర్ బుక్ చేయాలని అనుకునే వాళ్లకు ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. పేటీఎం యాప్ ద్వారా తొలిసారి గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే వాళ్లు ఈ ఆఫర్ కు అర్హులు. ఈ ఆఫర్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న వాళ్లకు 10 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ లభించవచ్చు.

    కొందరికి తక్కువ మొత్తం క్యాష్ బ్యాక్ లభిస్తే మరి కొందరికి ఎక్కువ మొత్తం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 800 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా లభించే ఛాన్స్ ఉండటంతో గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే వాళ్లు ఈ విధంగా సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే మంచిది. గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న తర్వాత వచ్చే క్యాష్ బ్యాక్ ద్వారా లభించే క్యాష్ బ్యాక్ మొత్తానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.

    Also Read: ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లకు షాకింగ్ న్యూస్..?

    స్క్రాచ్ కార్డ్ ద్వారా పొందిన క్యాష్ బ్యాక్ మొత్తం 48 గంటల తర్వాత పేటీఎం వాలెట్ కు యాడ్ అవుతుంది. రోజురోజుకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.