https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ తో దెబ్బకు దరిద్రం పోయినట్టేనా?

సినిమా అనేది ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ బిజినెస్ గా మారింది. ఒకప్పుడు పాతిక కోట్లు కలెక్షన్ చేస్తే అబ్బో అనేవాళ్లం. కానీ ఇప్పుడు వందకోట్లు అనేది ఈజీగా ఓ సినిమా సాధిస్తోంది. ఇక బ్లాక్ బస్టర్ అయితే రూ.200 కోట్లు లాభం గ్యారెంటీగా వస్తోంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చీ సినిమాను నిర్మించే నిర్మాతలు హిట్ అయితే బాగుపడుతారు.. ఫ్లాప్ అయితే ఇండస్ట్రీలోనే అప్పుల పాలై చెదిరిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు భారీ చిత్రాలు తీసిన భారీ […]

Written By: , Updated On : April 5, 2021 / 10:24 PM IST
Follow us on

Ram Charan at RRR shooting

సినిమా అనేది ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ బిజినెస్ గా మారింది. ఒకప్పుడు పాతిక కోట్లు కలెక్షన్ చేస్తే అబ్బో అనేవాళ్లం. కానీ ఇప్పుడు వందకోట్లు అనేది ఈజీగా ఓ సినిమా సాధిస్తోంది. ఇక బ్లాక్ బస్టర్ అయితే రూ.200 కోట్లు లాభం గ్యారెంటీగా వస్తోంది.

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చీ సినిమాను నిర్మించే నిర్మాతలు హిట్ అయితే బాగుపడుతారు.. ఫ్లాప్ అయితే ఇండస్ట్రీలోనే అప్పుల పాలై చెదిరిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు భారీ చిత్రాలు తీసిన భారీ నిర్మాత ఎంఎస్ రాజు ఇప్పుడు రోమాంటిక్ సినిమాలు తీస్తూ తన కొడుకును కూడా ఇండస్ట్రీలో నిలబెట్టుకోలేకపోయారు.

నిర్మాత డీవీవీ దానయ్య సైతం ఎన్నో హిట్టూ ఫ్లాపుల తర్వాత ఇప్పుడు తన జీవితమంతా హాయిగా బతికేలా కోట్లకు పడగలెత్తబోతున్నారు. రాజమౌళితో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తీస్తున్న డీవీవీ దానయ్య సినిమా రిలీజ్ కు ముందే అన్ని హక్కులు అమ్మేశాడు.

ఇటీవలే మొత్తం సినిమాను అన్ని హక్కుల కలిపి 950 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. అంటే ఖర్చు సగం పోనూ 450 కోట్లలో హీరోలు ఇద్దరికీ 35 కోట్ల పారితోషికాలు పోగా.. మిగిలిన లాభం అంటే సగం దర్శకుడు రాజమౌళికి, నిర్మాత దానయ్యకు సగం. అంటే ఎంత లేదన్న నిర్మాతకు, దర్శకుడికి 200 కోట్లు చొప్పున తీసుకుంటారని తెలుస్తోంది.  ఇంత భారీ లాభాలు వచ్చాక నిర్మాత దానయ్య ఇక సినిమాల నుంచి రిటైర్ కాబోతున్నారా?