Homeఆంధ్రప్రదేశ్‌వివేకా హత్యపై వైఎస్ విజయమ్మ సంచలన లేఖ

వివేకా హత్యపై వైఎస్ విజయమ్మ సంచలన లేఖ

ఏపీ రాజకీయాల్లో మరో అనుకోని సంఘటన.. ఏపీ సీఎం జగన్ పై ఇంటివారి నుంచి బయట ఎల్లో మీడియా, చంద్రబాబు నుంచి చుట్టుముడుతున్న ‘వైఎస్ వివేకా హత్య కేసు’పై సంచలన మలుపు చోటుచేసుకుంది. సీఎం జగన్ తల్లి, వైఎస్ఆర్ భార్య అయిన వైఎస్ విజయమ్మ సంచలన లేఖ రాశారు. మూడు రోజులుగా అటు ఎల్లో మీడియా, టీడీపీతోపాటు… వైఎస్ వివేకా కూతురు తన తండ్రి హత్య కేసు దోషులను ఎందుకు పట్టుకోవడం లేదని నినదిస్తూ చేస్తున్న ఆరోపణలతో సీఎం జగన్ డిఫెన్స్ లో పడిపోయాడు. దీనిపై వైఎస్ఆర్ భార్య విజయమ్మ ప్రజలకు సమాధానం చెబుతూ బహిరంగ లేఖ రాశారు.

వైఎస్ వివేకానందరెడ్డి మా మరిది గారని.. ఆయన్ను 2019 మార్చిలో ఎవరు హత్య చేశారన్నది ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిందేనని విజయమ్మ స్పష్టం చేశారు. ‘ఇది నామాట.. ఇదే జగన్ మాట’ అని విజయమ్మ తేల్చిచెప్పారు. ఇందులో మా కుటుంబంలో ఎప్పటికీ రెండు అభిప్రాయాలు లేవు అని తెలిపారు.

హత్య జరిగింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2019 మార్చిలో అని.. ఆ హత్య తర్వాత రెండున్నర నెలలు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఆ జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి పాత్రమీద అనుమానులుంటే ఎందుకు విచారణ జరుపలేదని విజయమ్మ ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరి సైడ్ అయితే పవన్ కళ్యాన్ మాత్రం సీబీఐ కేంద్రం చేతిలో ఉంటే ఎందుకు నిగ్గుతేల్చాలని అడగడం లేదని.. జగన్ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు.

వివేకానందరెడ్డి గారి మీద జగన్ చేయిచేసుకున్నారని వార్తలు రాశారని.. అలాంటి సంస్కృతి మా కుటుంబంలో లేదని.. తోటమాలిని కూడా అన్న అని గౌరవించే సంస్కృతి మాది అని విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. ఈ పరిణామాలపై నేను కూడా కుమిలిపోయానని రాశారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ మరణించాక తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారని.. చంద్రబాబు పరపతి తగ్గిపోయి జగన్ కు పెరుగుతుంటే చూసి ఓర్వలేక జైలుకు పంపారని లేఖలో విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు-ఈటీవీ, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్, టీవీ5 వంటి మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు, చర్చలు ప్రసారం చేస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం అని తెలిపాయి.

వీరికి జతగా గత కొన్నేళ్లు పవన్ కళ్యాణ్ కూడా వారి బాటలోనే మా కుటుంబాన్ని టార్గెట్ చేశారని విజయమ్మ ఆరోపించారు. పైన చెప్పిన పార్టీలు నేతలు అందరూ కలిసి అసత్యాలను ప్రజల్లోకి రుద్దుతున్నారని.. ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పడుతుంటే మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీని ఎన్నికల్లో గెలిపిస్తుండడంతో టీడీపీపై ప్రజలను కన్విన్స్ చేయడం సాధ్యం కాదు కాబట్టి మా కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారం వారం రాస్తున్న రాతల్ని చూస్తే ఈయన చేసేది జర్నలిజమేనా? అనిపిస్తోందన్నారు.

లేఖ పూర్తి పాఠం ఇదీ..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version