వైరల్: డబ్బు తీసుకొని ఓటేసినోళ్లకు జేసీ షాక్

నేతలకు బుద్దిచెప్పే ప్రజలు ఉన్నారు. కానీ ప్రజలు తప్పు చేస్తే.. ఆ తప్పును ఎత్తి చూపే లీడర్లను చూశారా? మరోసారి ఓటు వేస్తారో లేదోనని ప్రజల పట్ల నేతలు సౌమ్యంగా ఉంటారు. కానీ ఇక్కడున్నది రాయలసీమ రెడ్డప్ప. ఓట్లేసిన ప్రజలనే చీవాట్లు పెట్టాడు.  టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా […]

Written By: NARESH, Updated On : April 5, 2021 9:18 pm
Follow us on

నేతలకు బుద్దిచెప్పే ప్రజలు ఉన్నారు. కానీ ప్రజలు తప్పు చేస్తే.. ఆ తప్పును ఎత్తి చూపే లీడర్లను చూశారా? మరోసారి ఓటు వేస్తారో లేదోనని ప్రజల పట్ల నేతలు సౌమ్యంగా ఉంటారు. కానీ ఇక్కడున్నది రాయలసీమ రెడ్డప్ప. ఓట్లేసిన ప్రజలనే చీవాట్లు పెట్టాడు.  టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఓటర్లకు రివర్స్ పంచ్ ఇచ్చారు. పలు వార్డుల్లో పర్యటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జేసీ ఫైర్ అయ్యారు. ‘ఓటుకు రూ.2వేలు ఇచ్చానని.. నేనెందుకు పనిచేయాలిరా?’ అంటూ ఓటర్లపై చెలరేగిపోయారు.

రోడ్లు సరిగ్గా లేవని.. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని స్థానికులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కొత్త రోడ్లు వేయాలని జేసీకి విన్నవించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి చెలరేగిపోయారు. ప్రజలపై రివర్స్ అటాక్ కు దిగారు.

‘ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చానని.. ఓటుకు డబ్బులు తీసుకొని ఇప్పుడు పనులు చేయండి’ అని అడుగుతారా? అంటూ ఓటర్లను జేసీ నిలదీశారు. ఓటుకు డబ్బు తీసుకున్న వారికి పనులు చేయాలని అడిగే హక్కు లేదని చెప్పారు. డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే.. తాను పనులు చేసే వాడినని అన్నారు.

డబ్బులు తీసుకోకుండా తనకు ఓటు వేసి ఉంటే.. అప్పుడు కాలర్ పట్టుకొని ప్రశ్నించే ఓటర్లకు ఉండేదని అన్నారు. డబ్బు తీసుకున్న ఏ నా కొడుకుకు పనిచేయిమనే అర్హత లేదంటూ బండబూతులతో విరుచుకుపడ్డారు. రూ.2వేల ఓటు తీసుకున్నోడికి ఎందుకు పనిచేయాలని నిలదీశారు.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓట్లేసిన ప్రజలపై ఇంత కఠినంగా మాట్లాడిన నేత మరొకరు లేరు. ఓట్లేసిన జనాలకు చీవాట్లు పెట్టి వారికి జ్ఞానోదయం కలిగించిన నేతగా జేసీకి పేరుంది.