అదే పీటముడి.. రైతులతో ఒడవని ‘పంచాయితీ’

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 8 రోజులుగా ఢిల్లీ శివారులను దిగ్బంధించిన రైతుల ఆందోళన ఇప్పట్లో విరమించే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఈరోజు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మైనస్ డిగ్రీల చలిని తట్టుకుంటూ రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. Also Read: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త.. ఆ సర్వీసులు పెంపు..? తాజాగా కేంద్రమంత్రులు తోమర్ , పీయూష్ గోయల్ లతో రైతు నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాదాపు ఏడు గంటలుగా చర్చలు జరిపినా […]

Written By: NARESH, Updated On : December 4, 2020 2:47 pm
Follow us on

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 8 రోజులుగా ఢిల్లీ శివారులను దిగ్బంధించిన రైతుల ఆందోళన ఇప్పట్లో విరమించే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఈరోజు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మైనస్ డిగ్రీల చలిని తట్టుకుంటూ రైతన్నలు ఆందోళన చేస్తున్నారు.

Also Read: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త.. ఆ సర్వీసులు పెంపు..?

తాజాగా కేంద్రమంత్రులు తోమర్ , పీయూష్ గోయల్ లతో రైతు నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాదాపు ఏడు గంటలుగా చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. దీంతో మరోసారి ఎల్లుండి 5న రైతులతో చర్చించాలని కేంద్రమంత్రులు నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇగో లేదని.. రైతుల సమస్యలు, అభ్యంతరాలు పరిష్కరిస్తామని కేంద్రమంత్రులు తెలిపారు. వ్యవసాయ చట్టాలతో రైతులకే లాభం అని.. మద్దతు ధర వస్తుందని కేంద్రమంత్రులు రైతులకు వివరించే ప్రయత్నం చేశారు. అవసరమైతే చట్టాల్లో సవరణలు చేస్తామని చెప్పారు. కానీ రైతు సంఘాలు మాత్రం తిరస్కరించాయి. మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని రైతు నేతలు స్పష్టం చేశారు. దీంతో ఈ పీటముడి తెగక చర్చలు విఫలమయ్యాయి.

Also Read: రైతు ఉద్యమం: మోడీకి మేధావుల సెగ

ట్విస్ట్ ఏంటంటే చర్చల విరామం సమయంలో 35 రైతుల సంఘాల నేతలకు కేంద్రం మధ్యాహ్నం భోజనం సమకూర్చింది. అయితే కేంద్రం ఇచ్చిన ఆహారాన్ని తీసుకునేందుకు రైతు నేతలు నిరాకరించారు. తాము స్వయంగా తీసుకొచ్చుకున్న ఆహారాన్నే తింటామని కేంద్రమంత్రులకు షాకిచ్చారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్