సబ్జా గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

మనలో ప్రతి ఒక్కరికీ సబ్జా గింజల గురించి తెలిసే ఉంటుంది. నీటిలో వేయగానే ఉబ్బి జెల్ లా కనిపించే సబ్జా గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. చాలామంది ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తరువాత కూల్ డ్రింక్స్, షరబత్ లు తాగుతూ ఉంటారు. అయితే వాటి కంటే సబ్జా గింజల పానీయం తీసుకుంటే మంచిది. సబ్జాగింజలు నానబెట్టిన నీరు తాగితే కూడా అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. Also Read: కీళ్ల నొప్పులను సులువుగా తగ్గించుకోవడానికి […]

Written By: Navya, Updated On : December 4, 2020 12:12 pm
Follow us on


మనలో ప్రతి ఒక్కరికీ సబ్జా గింజల గురించి తెలిసే ఉంటుంది. నీటిలో వేయగానే ఉబ్బి జెల్ లా కనిపించే సబ్జా గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. చాలామంది ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తరువాత కూల్ డ్రింక్స్, షరబత్ లు తాగుతూ ఉంటారు. అయితే వాటి కంటే సబ్జా గింజల పానీయం తీసుకుంటే మంచిది. సబ్జాగింజలు నానబెట్టిన నీరు తాగితే కూడా అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

Also Read: కీళ్ల నొప్పులను సులువుగా తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలివే..?

సబ్జా గింజలు చలవ కోసం మాత్రమే కాక మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, అధిక బరువు, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. గోరువెచ్చని నీళ్లలో సబ్జా గింజలను గంట సమయం ఉంచితే అవి జెల్లీలా మారిపోతాయి. ఆ సబ్జా గింజలను పంచదార లేదా చక్కర కలిపిన నీటిలో వేసుకుని తాగాలి. కొందరు సబ్జా గింజలను బాసిల్ అనే పేరుతో పిలుస్తారు.

Also Read: పిస్తా పప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

సబ్జా గింజలు మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి. అసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలను తగ్గించడంలో సబ్జా గింజలు సహాయపడతాయి. సబ్జా గింజలతో తయారు చేసిన పానీయం రోజూ తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో సబ్జా గింజలు సహాయపడతాయి. డీ హైడ్రేషన్ తో బాధ పడేవారు తరచూ సబ్జా గింజల పాయసం తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

వాంతులు, వికారం లాంటి సమస్యతో బాధ పడే వాళు సబ్జా గింజల పానీయం తీసుకుంటే మంచిది. అల్లం, రసం, తేనెలతో సబ్జా గింజల పానీయం తాగితే శ్వాస సంబంధిత సమస్యలు సులభంగా దూరమవుతాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సబ్జా గింజల పానీయం తీసుకోవచ్చు. సబ్జా గింజలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సహాయపడతాయి.