https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ : రాజమౌళి మరో సర్ ప్రైజ్

కరోనా క్రైసిస్.. లాక్డౌన్.. టాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీసింది. సినిమా షూటింగులన్నీ వాయిదా పడటంతో దర్శక నిర్మాతలు.. స్టార్ హీరోల ప్లాన్స్ అన్ని కూడా తలకిందులయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగులు ప్రారంభమయ్యాయి. ఆర్ఆర్ఆర్ ను పట్టాలెక్కించే పనిలో రాజమౌళి పడ్డారు. Also Read: ‘పుష్ప’కి బిగ్ షాక్.. ఒకరు మృతి.. మరో 20 మందికి.. ! టాలీవుడ్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేయచ్చని నిరూపించిన దర్శకుడు రాజమౌళి. ‘బాహుబలి’ సిరీసులతో తెలుగు సినిమా స్టామినా ఎలా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2020 / 09:13 PM IST
    Follow us on

    కరోనా క్రైసిస్.. లాక్డౌన్.. టాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీసింది. సినిమా షూటింగులన్నీ వాయిదా పడటంతో దర్శక నిర్మాతలు.. స్టార్ హీరోల ప్లాన్స్ అన్ని కూడా తలకిందులయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగులు ప్రారంభమయ్యాయి. ఆర్ఆర్ఆర్ ను పట్టాలెక్కించే పనిలో రాజమౌళి పడ్డారు.

    Also Read: ‘పుష్ప’కి బిగ్ షాక్.. ఒకరు మృతి.. మరో 20 మందికి.. !

    టాలీవుడ్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేయచ్చని నిరూపించిన దర్శకుడు రాజమౌళి. ‘బాహుబలి’ సిరీసులతో తెలుగు సినిమా స్టామినా ఎలా ఉంటుందనేది చిత్రసీమలోని ప్రతీఒక్కరికీ రుచిచూపించాడు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.

    Also Read: ‘రాంగ్ గోపాల్ వర్మ’ మూవీ ఎలా ఉందంటే..?

    ఇటీవలే 50 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసిన రాజమౌళి రాత్రివేళ చలిలో నటీనటులతో యాక్టింగ్ ను పిండేశాడు. ఆ షెడ్యూల్ ముగియగానే ఇప్పుడు ఓ చిన్న షెడ్యూల్ ను జక్కన్న ప్లాన్ చేశాడు.

    ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ టీం.. ‘మహాబలేశ్వర్’లోని అందమైన లోకేషన్స్ లో సందడి చేస్తోంది. అక్కడ షూటింగ్ మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీం ట్విట్టర్ లో విడుదల చేసింది.

    ఆర్ఆర్ఆర్ విడుదల చేసిన ఈ వీడియోలో క్రేన్ షాట్లు, డ్రోన్లతో బైక్ మీద హీరో వెళుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. ఎన్టీఆర్, రాంచరణ్ ఈ చిత్రం షూటింగ్ లో జాయిన్ అవుతారని చిత్రం యూనిట్ పేర్కొంది. కరోనాతో ఆగిపోయిన ఆర్ఆర్ఆర్ ను ఇప్పుడు రాజమౌళి జెట్ స్పీడుతో పరుగులు పెట్టిస్తున్నట్టు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్