
రాష్ట్రంలో 104 కాల్ సెంటర్ సమర్ధంగా పనిచేయాలని ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా బాధితులు 104 కి ఫోన్ చేసిన 3 గంటల్లోనే పడక కేటాయించాలని చెప్పారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్పత్రుల్లో నాణ్యతతో కూడిన ఆహారం, ఔషధాలు ఉండాలని ఆదేశించారు.