తెలంగాణలో న్యూ వేడుకలకు ప్రభుత్వం పలు ఆంక్షలు పెడుతూ అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూనే న్యూ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఈమేరకు పోలీస్ యంత్రాంగం సైతం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంది.
Also Read: న్యూ ఇయర్‌కి తెలంగాణలో గ్రాండ్ వెల్‌కం
డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం.. నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులతో తాగుబోతుల భరతం పట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు.
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోగా తీసుకుంది. దీనిపై గురువారం విచారించిన కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణలో కొత్త వైరస్ కేసులు ఉండగా న్యూ ఇయర్ వేడుకలకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని ధర్మాసనం ప్రశ్నించారు. బార్లు.. పబ్బులు విచ్చలవిడిగా ఓపెన్ చేసి ఏం చేయాలి? అనుకుంటుందో చెప్పాలని ప్రశ్నించింది.
రాజస్థాన్.. మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేయగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థంకావడం లేదని మండిపడింది.
Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!
ప్రభుత్వం మాత్రం న్యూ ఇయర్ వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించినట్లు కోర్టుకు విన్నించింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నేడు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతీఒక్కరూ భౌతిక దూరం.. మాస్క్‌లు ధరించాలని కోరింది. ఈ వేడుకలకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వం జనవరి 7న సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్