https://oktelugu.com/

నిహారిక పెళ్లి తర్వాత ప్లాన్.. దీంతో రద్దు !

మొత్తనికి కరోనా దెబ్బకు న్యూ ఇయర్ వేడుకులు కూడా ఈ సారి డల్ గా చేసుకోవాల్సిన పరిస్థితి. దాంతో వచ్చే ఇయర్ ను కూడా బ్యాడ్ ఇయర్ లాగానే మొదలపెట్టాల్సిన పరిస్థితి. న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని స్టార్స్ ఎన్నో ప్లాన్స్ చేసుకుంటారు. అందులో మెగా ఫ్యామిలీ ఒకటి. పైగా ఇటీవల నిహారిక పెళ్లిలో మెగా ఫ్యామిలీ మొత్తం ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసిందో తెలుసు. అయితే మళ్ళీ అల అందరు […]

Written By:
  • admin
  • , Updated On : December 31, 2020 / 01:38 PM IST
    Follow us on


    మొత్తనికి కరోనా దెబ్బకు న్యూ ఇయర్ వేడుకులు కూడా ఈ సారి డల్ గా చేసుకోవాల్సిన పరిస్థితి. దాంతో వచ్చే ఇయర్ ను కూడా బ్యాడ్ ఇయర్ లాగానే మొదలపెట్టాల్సిన పరిస్థితి. న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని స్టార్స్ ఎన్నో ప్లాన్స్ చేసుకుంటారు. అందులో మెగా ఫ్యామిలీ ఒకటి. పైగా ఇటీవల నిహారిక పెళ్లిలో మెగా ఫ్యామిలీ మొత్తం ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసిందో తెలుసు. అయితే మళ్ళీ అల అందరు కలిసి న్యూ ఇయర్ వేడుకులు చేసుకోవాలనుకున్నారట. ఈ సారి మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ కపుల్స్ అందరికి గ్రాండ్ పార్టీ ఇవ్వాలని.. అందుకు తగ్గ ఏర్పాట్లును కూడా చేశారట.

    Also Read: సంక్రాంతి బరిలో దిగుతున్న నాలుగు సినిమాలు..!

    కాగా నిహారిక పెళ్లి కోసమని ఉదయ్ పూర్ కు దాదాపు 100మంది కుటుంబ సభ్యులతో కలిసి వెల్లిన మెగా కుటుంబ సభ్యులు కరోనా వైరస్ ను దాటి పెళ్లికి ఎలాంటి ఆటంకం జరగకుండా జాగ్రత్త పడినా.. ఆ వేడుక తరువాత కొన్ని రోజులకే మెగా ఫ్యామిలిలో కరోనా కల్లోలం సృష్టించడంతో మొత్తానికి గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న మరో వేడుకను ఇప్పుడు అయిష్టంగానే రద్దు చేసుకున్నారు. మరోపక్క దాదాపు కరోనా ఎండ్ అవుతోందనుకున్న సమయంలో మళ్ళీ వైరస్ కొత్త తరహా పంజా విసురుతోంది. ఇటీవల రామ్ చరణ్ కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలడం, వరుణ్ కి కూడా సేమ్ అలాగే పాజిటివ్ అని రావడంతో మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది.

    Also Read: రవితేజ రీల్ కూతురు ఇప్పుడు హీరోయిన్ లా ఉందిగా !

    దాంతో మెగా ఫ్యామిలీలో అందరూ టెస్టులు చేయించుకున్నారు. అదృష్టం కొద్దీ ఎవ్వరికీ కరోనా పాజిటివ్ రాలేదు. కాకపోతే కుటుంబం మొత్తం కలిసి పార్టీలు చేసుకోకుండా దూరాన్ని అయితే కరోనా పెంచింది. అయినా ఎంతగానో జాగ్రత్తగా ఉంటూ నిత్యం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటు వర్కౌట్స్ చేసే హీరోలకు కూడా ఇలా ఈజీగా కరోనా వస్తుండటంతో.. సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్