
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. ఇందుకనుగుణంగానే కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
Also Read: తెలంగాణలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ఇలా..
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో వేలకోట్ల రూపాయాలతో రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఖజనాలో సగానికి పైగా డబ్బులు వ్యవసాయ రంగానికే ఖర్చు పెడుతున్నారంటే రైతుల విషయంలో కేసీఆర్ ఏవిధంగా ముందుకెళుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో ఇప్పటికే రైతులకు 24గంటల ఉచిత కరెంట్.. రబీ.. ఖరీఫ్ లలో రైతు బంధు.. రైతు బీమా.. రుణమాఫీ., గొర్రెలు.. బ్రరెల పంపిణీ.. మత్స్యకారుల కోసం చేపల పంపిణీ వంటి అనేక పథకాలను అమలు చేస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తెలంగాణలోని రైతులు వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలుచేసి విజయాలు సాధించిన వారిని కేసీఆర్ తన ఫాంహౌస్ కు పిలిపించుకొని మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా కేసీఆర్ ఏపీ రైతుకు ఫోన్ చేసి అభినందించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: తెలంగాణలో కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడో తెలుసా?
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావుతో సీఎం మాట్లాడి ఫోన్లో మాట్లాడారు. సీడ్రిల్ ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై కేసీఆర్ రైతును అడిగి వివరాలను తెలుసుకున్నాడు.
సన్నరకం వరి సాగుచేసిన ప్రసాదరావు 35ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి ఎకరానికి 40-45 బస్తాల దిగుబడి సాధించాడు. దీంతో రైతు ప్రసాదరావును కేసీఆర్ అభినందించడంతో ఒకసారి హైదరాబాద్ వచ్చిన తనను కలువాలని కోరారు.
అదేవిధంగా ప్రసాదరావును తెలంగాణలో వ్యవసాయ పద్ధతులను పరిశీలించాలని కోరినట్టు తెలుస్తోంది. పక్కా రాష్ట్రంలోని రైతు శ్రమను కూడా గుర్తించి కేసీఆర్ అభినందించడంతో ఆయన వ్యవసాయం గురించి ఎంత అప్ డేట్ తో ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
Comments are closed.