https://oktelugu.com/

తేజ మరో సంచలనం.. ఏకంగా 45 మంది కొత్తవారితో చిత్రం

అప్పుడెప్పుడో ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘నువ్వు-నేను’తో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు మధ్యలో ఫ్లాపులతో వెనుకబడ్డాడు. మధ్యలో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా దర్శకుడు తేజా రెండు చిత్రాలను ప్రకటించారు. ఒకటి రానాతో, మరొకటి గోపిచంద్ తో మూవీ. అవి ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. ఈ సినిమాలు పట్టాలెక్కుతాయా? లేదా అనేది సందేహమే. Also Read: అదే నా కల అని చెబుతున్న అనసూయ..: అదేంటో తెలుసుకుందాం తేజా ఇప్పుడు తన […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2021 / 05:13 PM IST
    Follow us on

    అప్పుడెప్పుడో ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘నువ్వు-నేను’తో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు మధ్యలో ఫ్లాపులతో వెనుకబడ్డాడు. మధ్యలో అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా దర్శకుడు తేజా రెండు చిత్రాలను ప్రకటించారు. ఒకటి రానాతో, మరొకటి గోపిచంద్ తో మూవీ. అవి ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. ఈ సినిమాలు పట్టాలెక్కుతాయా? లేదా అనేది సందేహమే.

    Also Read: అదే నా కల అని చెబుతున్న అనసూయ..: అదేంటో తెలుసుకుందాం

    తేజా ఇప్పుడు తన మొదటి చిత్రం చిత్రమ్ సీక్వెల్ ను తీయడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు అందరూ కొత్తవాళ్లతో “చిత్రమ్ 1.1” పేరుతో సినిమా ప్లాన్ చేశారు. ఈ సీక్వెల్ చాలా మంది కొత్తవారిని పరిచయం చేస్తుండడం విశేషం. “ఈ సంవత్సరం 45 కొత్త వారిని టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాం” అని తేజా ఈ సినిమా పోస్టర్‌తో పాటు సోషల్ మీడియాలో సినిమాను ప్రకటించారు.

    తన పాత సహచరులను ఈ సినిమాతో మరోసారి కలుపబోతున్నాడు తేజ. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని.. సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్‌ను సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత మళ్లీ తేజా సినిమాకు పనిచేస్తున్నారు. ఆర్పీ ఈ చిత్రానికి సంగీతం అందించనుండడం విశేషంగా మారింది.

    Also Read: గోవాలో కీర్తి సురేష్ తో మహేష్ బాబు

    తేజా – ఆర్.పి.పట్నాయక్ ల జోడి టాలీవుడ్ లోనే విజయవంతమైన కలయికగా గుర్తింపు పొందింది. వీరిద్దరూ కలిసి వివిధ హిట్ చిత్రాలకు పనిచేశారు. రొమాంటిక్ కామెడీగా తీస్తున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది.

    తన సుదీర్ఘ కెరీర్‌లో అతను అనేక మంది నటులను తేజా పరిచయం చేశాడు. ఉదయ్ కిరణ్, నితిన్, అనితా, రీమా సేన్, ప్రిన్స్, నవదీప్, సదా, గోపిచంద్, ఆర్‌పి పట్నాయక్, అనుప్ రూబెన్స్ తదితర, నటులు మరియు సాంకేతిక నిపుణులకు తేజా లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా “చిత్రమ్ 1.1” తో 45 మంది కొత్త వారిని టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్